రైతుగా మారిన ఒక‌ప్ప‌టి వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 Dec 2019 11:22 AM GMT
రైతుగా మారిన ఒక‌ప్ప‌టి వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి..!

ఆయ‌న‌ ప‌క్క రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు సంబందించి ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు. ఒక‌ప్పుడు అవిభ‌క్త ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కీల‌క మంత్రిత్వ‌ శాఖ‌లు నిర్వ‌హించిన వ్య‌క్తి ఆయ‌న‌. అయితే ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీ ఏపీలో జాడ‌ లేకుండాపోవడంతో.. ఇదివ‌ర‌కులా హ‌డావుడి లేదు. ప‌క్క‌నుండేవారంతా ఒక్కొక్కరుగా జారుకున్నారు.

అయితే.. ఆయన అందరిలా వేరే పార్టీ కండువా క‌ప్పుకోలేక‌ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఎలాగు తాను చ‌క్క‌బెట్టాల్సిన ప‌నులేవి లేక‌పోవ‌డంతో పొలంపనిలోకి దిగారు. సొంతూరిలో వ్యవసాయం చేసుకుంటూ ఆడుతూ.. పాడుతూ ప‌నిచేస్తుంటే అలుపు సొలుపేం ఉన్న‌ది అనే రీతిన ముందుకు సాగుతున్నాడు.

ఇంతకీ ఆయన ఎవరంటే? ఒకప్పుడు రోజువారి కార్య‌క్ర‌మాల్లో భాగంగా ప్రతి రోజూ మ‌నంద‌రికి కనబడిన నేత, మాజీ మంత్రి ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. అయితే.. ఒకప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ప‌నిచేసిన‌ ఆయన ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. ఉదయం 5 గంటలకు పొలానికి వెళ్లి.. సాయంత్రం వరకు పొలం ప‌నుల్లో బిజీగా ఉంటున్నారు. తానే డ్రైవ‌ర్ అయి సొంతంగా పొలం దున్నేస్తున్నాడు. మ‌రి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌లా.. రఘువీరారెడ్డి ఎంత దిగుబ‌డి సాధిస్తాడో తెలియాలంటే వేచి చూడాలి మ‌రి.

Next Story
Share it