కరోనా కట్టడి.. రాచకొండ ట్రాఫిక్​ పోలీసుల వినూత్న ప్రచారం

By అంజి
Published on : 19 March 2020 4:58 PM IST

కరోనా కట్టడి.. రాచకొండ ట్రాఫిక్​ పోలీసుల వినూత్న ప్రచారం

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తించకుండా తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు పలు ప్రకటనలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్‌పై అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. కాగా ప్రభుత్వానికి తోడుగా పలువురు ప్రముఖలు సైతం సోషల్‌ మీడియా వేదికగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ విషయమై పోలీసులు కూడా ప్రజలకు తమ వంతు అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా రాచకొండ పోలీసులు చేసిన వినూత్న రీతిలో ప్రజలకు కరోనా వైరస్‌పై చైతన్యపరిచారు.

Also Read: కరీంనగర్‌లో ఇండోనేషియా బృందం.. ఎక్కడెక్కడ తిరిగారంటే.?

నగరంలోని రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని ఓ జంక్షన్‌ వద్ద వాహనాలు ఆగి ఉన్న సమయంలో కరోనాపై అవగాహన కల్పించారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. చేతులు వీలైనంత వరకు ఎప్పటికప్పూడ శుభ్రం చేసుకోవాలన్నారు. చేతులు ఎలా కడుక్కోవాలన్న దానిపై డెమో కూడా చూపించారు. అయితే ఇందుకు సంబంధించిన ఓ వీడియోను పోలీసులు సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. కరోనా వైరస్‌ను అరికట్టేందుకు ఇక కొందరు తమకు తోచిన రీతిలో ప్రచారం చేస్తున్నారు. పోలీసులు చేపట్టిన ఈ వినూత్న ప్రచారాన్ని చూసిన నెటిజన్లు ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.



Next Story