ఏప్రిల్ 19 తేదీ ఆదివారం నుంచి 25వ తేదీ శనివారం వరకు వారఫలాలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 April 2020 1:59 AM GMT
ఏప్రిల్ 19 తేదీ ఆదివారం నుంచి 25వ తేదీ శనివారం వరకు వారఫలాలు

మేష రాశి :- ఈ రాశివారికి రవి ఉచ్చస్థానంలో ఉండడం వల్ల స్థానచలనం శుక్రుని వల్ల అది ప్రయోజనకరంగా మారే అవకాశం కనిపిస్తోంది. రాహు కొంత సంపదల్ని అందిస్తాడు అయితే కుజ గురులు ఒకే ఇంట్లో ఉండటం వల్ల శ్రమ తప్పదు. ఆటంకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కష్టానికి తగిన ఫలితం లభించడం తక్కువగా ఉంటుంది. కుటుంబపరంగా బానే ఉంటుంది పిల్లల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. ధన వ్యయం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. మీకు బుధుడి వ్యాపార వ్యవహారాల్లో ఉద్యోగాల్లో చిన్న ఇబ్బందులు ఏర్పడతాయి. చంద్రుని స్థితి బాగా లేనందువల్లే శారీరకంగా మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొని కొంత ధనాన్ని వెచ్చించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.వారాంతంలో శుభఫలితాలు పొందుతారు.అశ్విని నక్షత్ర జాతకులకు నైధన తారైంది పూర్తి వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. భరణి వారికి సాధన తారైంది మంచి ఫలితాలని పొందగలుగుతారు. కృత్తిక ఒకటో పాదం వారికి ప్రత్యక్ తారైంది పనులు వాయిదా పడతాయి.

పరిహారం:- మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి పూజ చేయించండి లేదా ఖడ్గమాల పారాయణ చేయండి శుభ ఫలితాలు ఉంటాయి ఆరోగ్యం కోసం ప్రతిరోజూ సూర్యుడి దర్శించండి.

వృషభరాశి :- ఈరాశి వారికి ఈ వారంలో కొద్దిపాటి శుభ పరిణామాలున్నాయి. అయితే రవి శుక్ర రాహువులు ఒకే క్రమంలో ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు మాత్రం ఎదుర్కోక తప్పదు. అకారణ కలహములు కొంత వస్తువుల్ని పోగొట్టుకోవడం లేదా ధనాన్ని పోగొట్టుకోవడం. ఆరోగ్యాన్ని ముఖ్యంగా కంటికి సంబంధించిన అనారోగ్యం వస్తుంది. వారం మధ్యలో ఆనందము లాభాన్ని పొందగలుగుతారు. చక్కనైన సౌఖ్యాన్ని పొందుతారు. కుజ గురు శనుల కలయిక మీకు ఇబ్బందిని కలగజేస్తుంది అయితే కొంతవరకు మీరు మాట పట్టింపులు తగ్గించుకున్నట్లేతే మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకున్న వారు అవుతారు. ధనవ్యయము తప్పదు. ఇతరుల వ్యవహారాల్లో అనవసరంగా కల్పించుకుని మీరు సమస్యల్ని తెచ్చుకుంటారు. కృత్తిక రెండు మూడు నాలుగు పాదాల వారికి ప్రత్యక్ తారైంది కాబట్టి ఫలితాలు తక్కువగా ఉన్నాయి. రోహిణి వారికి క్షేమ తారైంది కాబట్టి మంచి ఫలితాలను పొందగలుగుతారు. మృగశిర ఒకటి రెండు పాదాల వారికి విపత్తు తారైంది కొన్ని ఇబ్బందుల్ని చవి చూడక తప్పదు .

పరిహారం :- రాహు కేతువులు పూజ చేయించండి ప్రత్యేకించి వెండి సర్పాన్ని దానం చేస్తే మీకు మంచి ఫలితాలు ఉంటాయి.

మిధున రాశి :- ఈ రాశివారికి పరిస్థితులు కొంచెం జటిలంగా మారుతున్నాయి. రాశిలో ఉన్న రాహు తన ప్రభావాన్ని చూపి మరిన్ని సమస్యలు తీసుకురాబోతున్నాడు. అయితే ధనానికి లోటుండదు కానీ అనారోగ్యంతో అప్పులు చేయవలసినటువంటి పరిస్థితుంది. కుటుంబం అందరికీ కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఒకానొక సమయంలో ఇతరుల చేత మాట పడటము లేదా అధికారుల చేత నిందింపబడటం జరుగుతాయి. ఇంట్లో వాతావరణంలో మాత్రమే కొంత కొంత ఆనందాన్ని అనుభవిస్తారు. పెద్దవాళ్లు వయస్సు మళ్లిన వాళ్లకి శస్త్రచికిత్స అవసరం కూడా ఉంటుంది. మీరు అనుకున్న పనులు వాయిదా పడుతుంటాయి. ఇవి అంత వేగరంగా నెరవేరవు. ఒక సమస్య మిమ్మల్ని నీడలా వెన్నంటి మీకు ఇబ్బందిని కలిగిస్తుంది తప్పదు. శత్రువులు మీకు బాగా వ్యతిరిక్తంగాపని చేస్తారు. మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాల వారికి ప్రత్యక్తార పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. ఆరుద్ర వాళ్లకి క్షేమతార కాబట్టి బావుంది. పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు వారికి విపత్తు తారైంది వ్యతి రిక్త ఫరితాలు ఉన్నాయి.

పరిహారం :- కాలసర్ప యోగ దోషం వర్తిస్తుంది కాబట్టి వెండి సర్పాన్ని తయారు చేయించి పెరుగులో వేసి దానం చేయించండి. బియ్యం తెల్లని వస్త్రాలను దానం చేయండి .

కర్కాటక రాశి :- ఈ రాశివారికి సమస్యలు జటిలం అవుతున్నాయి. మీరు ఏ పని తలపెట్టినా ప్రతికూలతలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ధనాన్ని పోగొట్టుకుంటారు. సౌఖ్యం తక్కువగా ఉంటుంది . ఏ విషయంలోనైనా మధ్యవర్తిత్వం పనికిరాదు. కార్య విఘ్నాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆచితూచి అడుగు వేయండి. అనారోగ్య సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి సంబంధ బాంధవ్యాలు విషయాల్లో తొందరపడకండి. ద్రవ్య నష్టము ఉంది. వారం చివరిలో మీకు కార్యజయం జరుగుతుంది. ధనలాభం కూడా వస్తుంది. కానీ ప్రతి దానికి మీరు భయపడే పరిస్థితి ఉంది. ఇన్నాళ్లు అనుకూలించిన మీ మిత్రులు శ్రేయోభిలాషులు మీకు ఇప్పుడు ప్రతికూలంగా వర్షిస్తారు. ఇది చాలా కీలక సమయంగా భావించండి. పునర్వసు నాలుగో పాదం వారికి విపత్తు తారైంది చాలా జాగ్రత్త వహించండి. పుష్యమి వారికి సంపత్ తారైంది ఆర్థికంగా బాగుంది. ఆశ్రేష వారికి జన్మ తారైంది ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి.

పరిహార :- చంద్రునికి జపం చేయించండి. మంగళవారం నాడు అమ్మవారి దర్శనం చేస్తూ ఉండండి.

సింహ రాశి :- ఈ రాశివారికి ఈ వారం చాలా బాగుంది. ఒక్క ఆరోగ్యం తప్ప మిగతా అన్ని విషయాల్లో మీకు తిరుగు లేదు. విశేష ధనాదాయం వస్తుంది. మీ ఆలోచనలన్నీ కూడా మంచి ఫలితాల్ని ఇస్తూ మిమ్మల్ని అద్భుతంగా ప్రోత్సహిస్తాయి. మీరు ఏదనుకుంటే అది సాధించే స్థితి ఉంది. కుటుంబంతో గానీ వ్యాపార వ్యవహారాల్లో గానీ ఉద్యోగస్తులుగా అధి కారులతో గాని సంతోషంగా కాలం గడుపుతారు. మీకు ఈ వారంలో పొందినటువంటి అనందం ఒక మంచి అనుభూతిగా మిగిలిపోతుంది. కుటుంబ విషయంలో పిల్లలు గురించి ఖర్చు మానసిక వేదన తప్పదు. దీర్ఘకాలిక వేదనలు ఏవైనా ఉన్నట్లైతే కుటుంబపరంగా ఉద్యోగపరంగా మళ్లీ తిరగబడతాయి. మఖవారికి చాలా మంచి ఫలితాలున్నాయి. పుబ్బ వారికి కూడా శుభఫలితాలున్నాయి. ఉత్తర ఒకటో పాదం వారికి నైధన తారైంది కాబట్టి వ్యతిరేకత ఉంది.

పరిహారం :- చంద్రునిగూర్చి జపం చేయండి. గురునకు దక్షిణామూర్తి స్తోత్రం చేయించండి లేదా చేయండి.

కన్యా రాశి :- ఈ రాశివారికి కొద్దిపాటి సుఖ సౌఖ్యాలు అందబోతున్నాయి. సంతాన విషయంలో మాత్రం ఆరోగ్యంలో జాగ్రత్త వహించండి. మీరు అనుకున్న పనులు కొద్దికొద్దిగా వాయి దా పడిన చివర్లో మంచి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి. ఆర్థిక పరిపుష్టిని పొందగలుగుతున్నారు. శత్రు మూలకంగా మీకు భయం ఎక్కువగా ఉంటుంది. మానసిక శారీరక ఆందోళనను మీరు పొందుతారు. మీ ఆరోగ్యం మాత్రం జాగ్రత్త వహించండి. గౌరవ భంగం ఉంది కాబట్టి ముందుగానే మాట పట్టింపులు లేకుండా పెద్దల తోనైనా పిన్నల తోనైనా మంచిగా ప్రవర్తించండి. వారాంతంలో మీకు ధనానికి సంబంధించిన మంచి విషయాలు వింటారు. వ్యాపారులైతే మాత్రం జాగ్రత్త వహించండి. ఉత్తర ఫల్గుని రెండు మూడు నాలుగు పాదాల వారికి నైధన తారైంది పూర్తి వ్యతిరేక ఫలితాలే ఉన్నాయి. హస్తా నక్షత్రం వారికి సాధన తారైంది మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. చిత్త ఒకటి రెండు పాదాల వారికి ప్రత్యక్ తారైంది కాబట్టి ఫలితాలు వ్యతిరిక్తంగా ఉన్నాయి జాగ్రత్త వహించండి.

పరిహారం :- హనుమాన్ చాలీసా సుందర కాండ పారాయణ మంచి ఫలితాన్ని ఇస్తాయి.

తులా రాశి :- ఈ రాశివారికి ఆర్థిక పుష్టి ఎంతుందో వ్యయం కూడా అంతే ఉంది. ఒకటి స్థిరాస్తి కొనే అవకాశం ఉంది. శత్రువులు ఈ వారంలో మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడతారు. ఉదర సంబంధమైన హృదయ సంబంధమైన రోగాలు మీకు ఇబ్బంది కలిగించబోతున్నాయి. వారాంతంలో అలంకార ప్రాప్తి ఉంది. మీ కుటుంబంలో పెద్దలకు అనారోగ్య సూచనలు ఉన్నాయి. వ్యాపార వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. స్థిరాస్తి వ్యవహారాల్లో మీకున్న లావాదేవీల్లో కొంతవరకు లబ్ధిపొందే అవకాశం ఉంది. కుటుంబంతో మీరు ఆనందంగా గడపగలుగుతారు. ధనవ్యయం వున్నప్పటికీ కూడా ఒక ఆనందం కోసం ఓ మంచి కోసం ఖర్చుపెడతారు కాబట్టి అందులో కొంత సుఖ సౌఖ్యాలు ఉన్నాయి .చిత్త మూడు నాలుగు పాదాల వారికి ప్రత్యేకత రైంది పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి స్వాతి వారికి క్షేమ తయారైంది కాబట్టి ఫలితాలు బాగుంటాయి విశాఖ ఒకటి రెండు మ మూడు పాదాల వారికి విపత్తు తార అయింది కాబట్టి జాగ్రత్త వహించండి

పరిహారం :- రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా మంచిది. మంగళవారం సుబ్రహ్మణ్య పూజ చేయించుకోండి.

వృశ్చిక రాశి :- ఈ రాశివారికి కుటుంబంతో ఆనందంగా గడిపే అవకాశం ఉందిగానీ ధనవ్యయం తప్పదు. శారీర కష్టము అనారోగ్యము ధన లేమి కూడా ఉంది. శత్రువులు నశిస్తారు. నేత్ర సంబంధ అనారోగ్యం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి. విలువైన వస్తువుల్ని చేజేతులా పోగొట్టుకునే అవకాశం ఉంది. వాద ప్రతివాదనల వల్ల మీకు ప్రయోజనం లేదని తెలుసు. మీ కోపాన్ని తగ్గించుకోండి. మిత్రులు వల్ల ప్రయోజనం ఎంతైనా ఉంది. మీకు రావలసిన బాకీలు వసూలయ్యే అవకాశం ఉంది. మంచి పనులు చేసి మీరు కీర్తి ప్రతిష్టల్ని పొందుతారు. మీ ఆలోచనలకు మంచి అనుకూలతని తెచ్చుకోవాలంటే వ్యవహార జ్ఞానంతో మెలగండి. కుటుంబాల్లో గౌరవ భంగం లేకుండా చూసుకోండి. విశాఖ రెండు మూడు నాలుగు పాదాల వారికి విపత్తు తార అయింది ఇబ్బంది కలిగించే సమయం. అనురాధ వారికి సంపత్తు తార అయింది కాబట్టి చాలా బాగుంది. జ్యేష్ట వారికి జన్మతార అయింది కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి.

పరిహారం :- ఈ రాశివారికి పుణ్యక్షేత్ర సందర్శనం దక్షిణామూర్తి స్తోత్రం మంచి ఫలితాలను ఇస్తాయి.

ధనస్సు రాశి :- వీరికి చాలా ప్రతికూలమైన రోజులని చెప్పాలి. ఒక ప్రక్క ఆర్థిక ఇబ్బందులు ఇంకోపక్క మానసిక శారీరక అనారోగ్యాలు కుటుంబంలో ఇబ్బందులు కీర్తి ప్రతిష్టలకు భంగం కలగడం శత్రువులు ఒక్కసారిగా విజృంభించడం ప్రతి పనిలో వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. ఇవన్నీ మిమ్మల్ని శారీరకంగా మానసికంగా కుంగదీస్తాయి. మీరు ఏ పని తలపెట్టినా దానికి ఎవరో ఒకరు కాదనే వాళ్లు తప్పితే ప్రోత్సహించేవాళ్లు మీకు లేరు. ఉండరు. మీ స్వంత నిర్ణయంపై మీరు వెళ్లడం కూడా ఇబ్బందిగానే ఉంటుంది. అలాగని ఎవరినీ నమ్మితే మంచి జరగదు. క్షణక్షణం భయం భయంగానే మీరు ముందుకు వెళ్ళాలి. ఆత్మ స్థైర్యం ఉంటేగానీ ముందుకు పోలేరు. మూలా నక్షత్ర జాతకులకు నైధన తారైంది కాబట్టి వ్యతిరేకత ఫలితాలున్నాయి. పూర్వాషాడ వారికి మాత్రము సాధన తార అయింది పనులన్నీ నెరవేరతాయి. ఉత్తరాషాఢ ఒకటో పాదం వారికి ప్రత్యక్ తారైంది పనులన్నీ వెనుక పడతాయి.

పరిహారం :- గురునకు దక్షిణామూర్తి స్తోత్రము హయగ్రీవ స్తోత్రము చేస్తే మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శనికి నువ్వులు దానం చేయండి నల్లని వస్త్రం దానం చేయండి.

మకర రాశి :- ఈ రాశివారు తగు జాగ్రత్తలు తీసుకుంటేగానీ ఈ వారం దాటడం చాలా కష్టం. మీకు విచారము విపత్తు స్థానచలనం శత్రుపీడ అగౌరవము అన్ని ఒకేసారి చుట్టుముట్టు కుంటాయి. అనుకోకుండా వ్యయం మీ చేత చేయించేస్తారు. మానసిక శారీరిక ఆనందాలకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. శత్రువుల వల్ల హాని ఉంది కాబట్టి మీరు ఎంతవరకు పనులలో ముందుకు దూసుకుపోవడం అలవాటుందో దాన్ని అంత తగ్గించుకోండి. మీ స్థానాన్ని మీరు నిలబెట్టుకోవాలి అంటే ప్రతి ఒక్కడు చెప్పింది వినండి కానీ వెంటనే ఆచరించకండి దాన్ని కొద్దిసేపైనా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి. మీకు వ్యతిరేక ఫలితాలు ఉన్నప్పుడు ఇలాంటి సాధనా సంపత్తి చాలా అవసరము. బంధుమిత్రులు మిమ్మల్ని పలుకరించే అవకాశం ఉంది. వాళ్ళతో కూడా జాగ్రత్త వహించండి. ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వారికి ప్రత్యక్ తారైంది కాబట్టి వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. శ్రవణ నక్షత్ర జాతకులకు క్షేమ తార అయింది కాబట్టి చాలా మంచి ఫలితాల్ని పొందుతారు. ధనిష్ఠ ఒకటి రెండు పాదాలు వారికి విపత్తార అయింది కాబట్టి ఆలోచించి కార్యాన్ని నెరవేర్చుకోండి.

పరిహారం :- మీరు ఎక్కువగా సుబ్రహ్మణ్య పూజ చేయించండి. శనికి జపం గాని నల్లని వస్త్రదానం చేయండి.

కుంభరాశి :- ఈ రాశి వారికి ఈ వారంలో కొద్దిగా శుభ ఫలితాలు ఉన్నాయి. స్వర్ణాభరణాల ప్రాప్తి, సంపద, స్త్రీ సౌఖ్యం మీకు చాలా ఆనందాన్ని కలిగి స్థాయి. ప్రశాంతమైనటువంటి జీవనాన్ని గడుపుతారు. విశేష ధన లాభము ఉంది. స్థానచలనం ఉన్నా అది మీకు మంచి కోసమే జరుగుతుంది. అయితే గురుని ద్వారా మీ ఆలోచనల్లో మార్పు వచ్చి నష్టానికి దారి తీస్తుంది. మానసికంగా మీరు సంసిద్ధంగా లేని సమయాల్లో మీ ధనాన్ని కొంత పోగొట్టుకుంటారు. అనారోగ్యం కూడా మీకు సూచిస్తోంది. వారంలో విశేష ధనలాభాన్ని పొందుతారు. గురుడు నీచ పొందడం వల్ల కష్టాల్ని అనుభవించక తప్పదు. మీ అంత మీరుగా ఆలోచించి ఏ పని చేసినా దాని వల్ల వచ్చిన ఫలితం మీకు మేలునే చేకూరుస్తుంది. అదొక్కటే మీరు గుర్తు పెట్టుకున్నట్లయితే చాలా బావుంటుంది. ధనిష్ఠ మూడు నాలుగు పాదాల వారికి విపత్తార అయింది కాబట్టి శుభ ఫలితాలు చాలా తక్కువగా వున్నాయి. శతభిషా నక్షత్ర జాతకులకు సంపత్తార ఐంది. ధనలాభాన్ని పొందగలుగుతారు. పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదాల వారికి జన్మతార అయింది ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి.

పరిహారం :- సుబ్రహ్మణ్య అర్చన జరిపించండి గురు స్తోత్రాలు చేయండి మంచి ఫలితాన్ని పొందగలుగుతారు.

మీనరాశి :- ఈ రాశి వారికి మంచి ఫలితాలు ఉన్నాయి. చిక్కులు ఉన్నప్పటికీ ధనలాభం పొందుతారు కాబట్టి కాస్త అందులోంచి బయటకొచ్చే అవకాశం ఉంది. గౌరవం పొందే అవకాశం ఉంది కాబట్టి మీరు మాట పట్టింపులకు పోకండి. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అధికారులతో జాగ్రత్తగా ఉండండి. మీరు చేసే వృత్తి ఉద్యోగాల్ని పూర్తిగా నమ్మండి. మీరు చేసే ప్రతి పనిని గుర్తించి మీకు సహకరించే వాళ్లు ఉన్నారు. వారితో జాగ్రత్తగా వ్యవహరిస్తే మీకు శుభ ఫలితాలే కనిపిస్తాయి. కుటుంబంతో మీరు ఆనందంగా గడపగలుగుతారు. వారం మధ్యలో విశేష ధన లాభాలు ఉన్నాయి. వాథిని పొందే మార్గాలు కూడా జాగ్రత్తగా ఆలోచిస్తే మీకే తెలుస్తాయి. మీ మాట తీరు మార్చుకున్నట్లయితే మీరు చాలా మంచి ఫలితాలని పొందగలుగుతారు. పూర్వాభాద్ర నాలుగో పాదం వారికి జన్మతారైంది ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోండి. ఉత్తరాభాద్ర వారికి పరమ మిత్ర తారైంది కాబట్టి బావుంది. రేవతి వారికి మిత్రతార శుభ ఫలితాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.

పరిహారం :- శనికి జపం చేయించండి చాలా బావుంటుంది. నానవేసిన పెసలను బెల్లంతో కలిపి బుధవారం నాడు ఆవుకు తినిపించండి మంచి ఫలితాలు ఉంటాయి.

Next Story