క్వారంటైన్ అంటే ఏమిటి ?
By రాణి Published on 18 March 2020 7:13 AM GMTసుమారు రెండున్నర నెలలక్రితం చైనాలోని వుహాన్ నగరంలో గుర్తించిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటికీ వ్యాపించి..తన విశ్వ రూపాన్ని చూపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య 2 లక్షలకు చేరువవుతుండగా..కరోనా మృతుల సంఖ్య 7500కు చేరువలో ఉంది. చైనా తర్వాత వీరిలో ప్రస్తుతం ఎక్కువ మంది వైరస్ బాధితులు, మృతులు ఇటలీలోనే ఉన్నారు. భారత్ లో ఇప్పటి వరకూ 147 కరోనా కేసులు నమోదవ్వగా..తెలంగాణలో 5, ఆంధ్రప్రదేశ్ లో ఒక కరోనా కేసులు నమోదయ్యాయి. వీరంతా ప్రస్తుతం ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స తీసుకుంటున్నారు. కరోనా ప్రభావంతో ఇప్పటికే చాలా రాష్ర్టాలు స్కూళ్లు, కాలేజీలు, థియేటర్లు, మాల్స్, స్విమ్మింగ్ పూల్స్, జిమ్ సెంటర్లన్నింటినీ మూసివేయాలంటూ ఆదేశాలిచ్చింది. మరో రెండ్రోజులకు కరోనా కేసులు పెరిగితే గనుక..నిత్యావసర వస్తువులు, కూరగాయల మార్కెట్లు కూడా మూతపడే ప్రమాదముంది.
Also Read : తాటిముంజల వల్ల ఉపయోగాలెన్నో..మీకు తెలుసా ?
కరోనా నుంచి కోలుకున్న తర్వాత తిరిగి అన్నీ తెరుచుకున్నా..ఇన్నిరోజులు మూతపడి నష్టాలు చూసినవారంతా ఆ భారాన్ని తిరిగి వినియోగదారులపైనే వేస్తారు. కరోనా ప్రభావంతో భారత్ ఇతర దేశాల నుంచి దిగుమతులను నిలిపివేసింది. అలాగే అమెరికా, ఇటలీ, ఇరాన్, దక్షిణ దేశాలనుంచి వచ్చే విమానాల రాకపోకలపై కూడా ఆంక్షలు విధించింది. ఇప్పుడిప్పుడే దిగొచ్చిన ఉల్లి ధర మళ్లీ పెరుగుతోంది. గతవారం రూ.100కి నాలుగు కిలోలు అమ్మిన ఉల్లి..ఇప్పుడు రూ.70కి రెండు కిలోలు అమ్ముతున్నారు వ్యాపారస్తులు.
Also Read : ఆగని చైనా, అమెరికా పరస్పర విమర్శలు
ఇక అసలు విషయానికొస్తే..చాలా మందికి క్వారంటైన్ అంటే ఏంటో తెలియక తికమక పడుతున్నారు. ఇతర దేశాల నుంచి ఇండియాకు వచ్చే వారిని వికారాబాద్ తరహా ఫారెస్ట్ ఏరియాల్లో ఉన్న ఫాం హౌస్, గెస్ట్ హౌస్ లలో 14 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నారు. 14 రోజుల్లో ఎవరికైనా వైరస్ లక్షణాలు కనిపిస్తే..వారిని ఐసోలేషన్ వార్డుకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అక్కడ నెగిటివ్ వచ్చినా..కరోనా వైరస్ లక్షణాలు తగ్గేంత వరకూ ఆస్పత్రిలోనే ఉండాల్సి ఉంటుంది. ఈ పద్ధతినే క్వారంటైన్ అంటారు. కొంతమంది తమకు జలుబు, దగ్గు వంటి కరోనా లక్షణాలుంటే 14 రోజులు ఇళ్లకే పరిమితమవుతున్నారు. దీనిని సెల్ఫ్ క్వారంటైన్ అంటారు.
Also Read : గోల్డ్ స్మగ్లర్ తెలివికి అవాక్కయిన అధికారులు
ఇకపోతే కరోనా ప్రపంచ ఆర్థిక మాంద్యంపై పరోక్షంగా దెబ్బకొట్టింది. ఒక దేశంతో మరొక దేశానికున్న ఆర్థిక లావాదేవీలు ఆగిపోయాయి. దిగుమతి, ఎగుమతులను కూడా నిలిపివేశాయి. ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన భారత విద్యార్థులు తిరిగి స్వస్థలానికి చేరుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. వ్యాపార సంస్థలు మూతపడటంతో..గడిచిన 10 రోజుల్లో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. మదుపరులకు రెండు సోమవారాలు బ్లాక్ మండేలయ్యాయి. చరిత్రలో ఎన్నడూ లేనంతగా భారీ నష్టాలు రావడంతో..పెట్టుబడిదారులు లబోదిబోమంటున్నారు.