ముఖ్యాంశాలు

  • తనమాటల్ని సమర్థించుకున్న ట్రంప్
  • చైనా అలా మాట్లాడటం సరికాదని వ్యాఖ్య

భూమండలాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్ పై యావర్ ప్రపంచమంతా పోరాడుతోంది..ఆ రెండు దేశాలు తప్ప. అమెరికా కూడా కరోనా వైరస్ ను కట్టడి చేయాల్సిన పని వదిలేసి మరీ..చైనాపై ఆరోపణలు చేస్తూనే ఉంది. కరోనా వైరస్..చైనాలోని వుహాన్ నగరం నుంచి వ్యాపించింది కాబట్టి ఇది అమెరికా దీనిని చైనీస్ వైరస్, వుహాన్ వైరస్ అని పిలుస్తోంది. అమెరికా అలా పిలవడంపై ఆగ్రహం చెందిన చైనా..అసలు తమ దేశంలో వైరస్ వ్యాపించడానికి కారణం అమెరికానే అంటూ ఆరోపించింది.

Also Read : కరోనా అదుపుకు స్పెయిన్ ఏం చేసిందో తెలుసా

ట్రంప్ పక్కా ప్లాన్ ప్రకారమే..అమెరికా ఆర్మీ ద్వారా వైరస్ ను తమదేశంలో వ్యాపించేలా చేశారంటూ చైనా అధ్యక్షుడు కొద్దిరోజులుగా ఆరోపిస్తూనే ఉన్నారు. ఈ ఆరోపణలపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్..తమ దేశం వల్లే వైరస్ చైనాకు పాకిందని మాట్లాడటం సరికాదని హెచ్చరించారు. ఈ వైరస్ ఎక్కడి నుంచి వచ్చిందో దాని పేరు పెట్టిపిలవడం (చైనీస్ వైరస్) ఏ మాత్రం తప్పు కానేకాదన్నారు. అలాగే తమదేశం నుంచి చైనాకు రాకపోకలను నిలిపివేసి తాను చాలా మంచి చేశానంటూ ట్రంప్ సమర్థించుకున్నారు. ఇలా ఈ రెండు శత్రు దేశాలు వైరస్ పై పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి.

Also Read : కరోనా సెలవులు తమకు వర్తించవు.. ప్రభుత్వం చెబితే నేను వినాలా.?

కాగా..అమెరికాకు చైనాతో విభేదాల వల్ల అక్కడ మందుల తయారీకి కావాల్సిన ముడిసరుకు దిగుమతుల్లో అమెరికాకు ఇబ్బందులు తలెత్తే అవకాశముందన్న వార్తలను ట్రంప్ ఖండించారు. ఎందుకంటే..ఇరుదేశాల మధ్య గతంలో జరిగిన తొలి ఒప్పందాన్ని చైనా ఉల్లంఘిస్తుందని తాను అనుకోవడంలేదన్నారు. తమదేశ ఉత్పత్తులతో చైనాకు చాలా అవసరమున్న నేపథ్యంలో..చైనా తమతో ఉన్న సత్సంబంధాలను తెంచుకోవాలన్న ఆలోచన చేయదంటూ ట్రంప్ జోస్యం చెప్పారు.

Also Read : పాకిస్తాన్‌లో తొలి కరోనా మృతి

మరోవైపు అమెరికా వైరస్ ప్రభావం రోజురోజుకీ పెరుగుతుండటంతో..అమెరికా ప్రజలంతా ఇళ్లకే పరిమితమవ్వాల్సిందిగా ట్రంప్ సూచించారు. రాబోయే 15 రోజులు చాలా కీలకమని, అందరూ ఇంటిలోనే ఉండాలని ట్రంప్ కోరారు. సమస్య అదుపులోకి వచ్చేంత వరకూ ఈ ఆంక్షలు తప్పవన్నారు. మిగతా దేశాలతో పోలిస్తే..తమ దేశం పరిస్థితి కాస్త ఫర్వాలేదన్నారు ట్రంప్. కానీ..ప్రభుత్వం చేసే సూచనలు పాటించకపోతే మాత్రం..ఆర్థికమాంద్యం కుదేలవ్వక తప్పదన్నారు.

రాణి యార్లగడ్డ

Next Story