బీజేపీ నేత పురందేశ్వరికి కరోనా పాజిటివ్‌

By సుభాష్  Published on  30 Sep 2020 5:28 AM GMT
బీజేపీ నేత పురందేశ్వరికి కరోనా పాజిటివ్‌

కరోనా మహమ్మారి సామాన్యుడి నుంచి ప్రముఖుల వరకు ఎవ్వరిని వదిలిపెట్టడం లేదు. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు ఎక్కువైపోతున్నాయి. తాజాగా బీజేపీ సీనియర్‌ నేత పురందేశ్వరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. అనారోగ్యంగా ఉండటంతో పరీక్షలు చేయించుకోగా, ఆమెకు కరోనా సోకినట్లు తేలింది. అయితే లక్షణాలు కాస్త ఎక్కువగానే ఉండటంతో ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, ఇటీవల బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి వరించింది. ఈ క్రమంలో పలువురు నేతలు, కార్యకర్తలు ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అలా ఆమెకు కరోనా సోకి ఉండవచ్చని భావిస్తున్నారు.

కాగా, దేశంలో పాజిటివ్‌ కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా భారత్‌లో కొత్తగా 80,472 కేసులు నమోదు కాగా, 1179 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు దేశంలో ఇప్పటివరకు 62,25,763కి చేరగా, ఇప్పటి వరకు మరణాలు 97,497 సంభవించాయి.

Next Story