క‌రోనా వైర‌స్‌(కొవిడ్‌-19) ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. ఇప్ప‌టికే ఈ మ‌హ‌మ్మారి భారీన ప‌డి ప్ర‌పంచ‌వ్యాప్తంగా వేల సంఖ్య‌లో మృత్యువాత ప‌డ‌గా.. ల‌క్ష‌ల్లో క‌రోనా పాజిటివ్‌తో ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ మ‌హ‌మ్మారి క‌ట్ట‌డికి మ‌న దేశంలో కేంద్రం 21 రోజుల పాటు లాక్ డౌన్ ను విధించిన సంగ‌తి తెలిసిందే. ఆ లాక్‌డౌన్ మంగ‌ళ‌వారంతో పూర్తి కానుంది.

ఇదిలా ఉంటే మ‌న దేశంలో ఈ వైర‌స్ రోజు రోజుకు విజృంభిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారి భారీన ప‌డి 199 మంది మృత్యువాత ప‌డ‌గా.. 6412 మంది క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. మర్కాజ్‌ ఉదాంతం తర్వాత ఈ క‌రోనా వైర‌స్ ప‌లు రాష్ట్రాల్లో విజృంభిస్తోంది. దీంతో లాక్‌డౌన్‌ను పొడిగించాల‌ని ప‌లు రాష్ట్రాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. ఇప్ప‌టికే ఒడిశా ఓ అడుగు ముందుకు వేసింది. ఆ రాష్ట్రంలో ఈ నెల 30 వ‌ర‌కు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. తాజాగా ఒడిశా బాట‌లో పంజాబ్ కూడా ప‌య‌నిస్తోంది. శుక్ర‌వారం సాయంత్రం వ‌ర‌కు పంజాబ్‌లో 8 మంది మ‌ర‌ణించ‌గా.. 132 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. అందులో న‌లుగురు కోలుకున్నారు. దీంతో లాక్‌డౌన్ పొడిగించాల‌ని పంజాబ్ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. మే 1 వ‌ర‌కు ఆ రాష్ట్రంలో క‌ర్వ్యూ అమలులో ఉంటుంద‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.