పుల్వామా ఉగ్రదాడి.. ఆన్‌లైన్‌లో షాపింగ్‌..

By అంజి  Published on  7 March 2020 1:26 PM GMT
పుల్వామా ఉగ్రదాడి.. ఆన్‌లైన్‌లో షాపింగ్‌..

జమ్ముకశ్మీర్‌: గత సంవత్సరం జరిగిన పూల్వామా ఉగ్రదాడిలో 40 మందిని మరణించిన విషయం తెలిసిందే. కాగా ఉగ్రదాడికి సంబంధించిన దర్యాప్తును ఎన్‌ఐఏ కొనసాగిస్తోంది. తాజాగా పుల్వామా దాడికి సంబంధం ఉన్నట్లుగా అనుమానిస్తున్న మరో ఇద్దరిని ఎన్‌ఐఏ అధికారులు అరెస్ట్‌ చేశారు. భద్రతా బలగాల కాన్వాయ్‌ను పేల్చివేసేందుకు ఐఈడీ బాంబులను వాడారు. వీటి తయారీలో కీలకంగా వ్యవహరించిన వాజ్‌-ఉల్‌-ఇస్లాం, మహ్మద్‌ అబ్బాస్‌లను శుక్రవారం అధికారులు అరెస్ట్‌ చేశారు.

బాంబు తయారీ కోసం కెమికల్స్‌ కొనుగోలు చేసినట్లు, అయితే వీటిని ఈ-కామర్స్‌ సంబంధించిన అమెజాన్‌లో కొనుగోలు చేసినట్లు గుర్తించామని అధికారులు చెప్పారని ఓ మీడియా సంస్థ చెప్పింది. ఈ కేసుకు సంబంధించి అరెస్ట్‌ అయిన నిందితుల సంఖ్య ఐదుకు చేరింది. నిందితులను అధికారులు విచారిస్తున్నారు. తన అమెజాన్‌ షాపింగ్‌ అకౌంట్‌ నుంచి జైషే మహ్మద్‌ ఉగ్రవాదుల సూచనల మేరకు వివిధ కెమికల్స్‌, బ్యాటరీలు, ఇతర పదార్థాలను కొనుగోలు చేసినట్లు వాల్‌-ఉల్‌-ఇస్లాం అంగీకరించడానికి ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. జైషే ఉగ్రవాదులకు వ్యక్తిగతంగా వీటన్నింటినీ ఇస్లామే చేరవేశాడన్నారు.

కాగా పుల్వామా ఉగ్రదాడికి ఉపయోగించిన ఐఈడీని మహ్మద్‌ ఉమర్‌ తయారు చేశాడు. అయితే మహ్మద్‌ ఉమర్‌కు 2018 నుంచి అబ్బాస్‌ తన ఇంటిలో షెల్టర్‌ కల్పించాడు. జైషే ఉగ్ర సంస్థ కోసం అబ్బాస్‌ రహస్యంగా పని చేశాడు. సైనికుల వాహనాలపై ఆత్మాహుతి పాల్పడిన ఆదిల్‌ అహ్మద్‌ దార్‌కు, పాకిస్తాన్‌ నుంచి వచ్చిన సమీర్‌ అహ్మద్‌ దార్‌, క్రమాన్‌లకు అబ్బాస్‌ సహకరించడాని అధికారులు పేర్కొన్నారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన పలువురికి సహకారం కూడా అందించాడని చెప్పారు. కాగా ఇస్లామ్‌ను, అబ్బాస్‌ను త్వరలోనే ఎన్‌ఐఏ స్పెషల్‌ కోర్టు ముందు ప్రవేశపెడతామని అధికారులు తెలిపారు. ఉగ్రవాదులకు చాలా సార్లు ఆహారం, ఇతర వస్తువులు సమకూర్చారన్న ఆరోపణలతో హక్రిపొరాకు చెందిన తౌఫిక్‌ అహ్మద్‌ షా, అతడి కూతురు ఇన్షాజాన్‌లను బుధవారం అరెస్ట్‌ చేశారు.

Next Story