పవర్ స్టార్ బర్త్ డే కానుకగా #PSPK27 ప్రీ లుక్ పోస్టర్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Sep 2020 7:38 AM GMT
పవర్ స్టార్ బర్త్ డే కానుకగా #PSPK27 ప్రీ లుక్ పోస్టర్

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ పుట్టిన రోజు సందర్భంగా పవన్‌ అభిమాలకు మరో కొత్త సినిమా అప్‌డేట్‌ వచ్చేసింది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్‌ ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడికల్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఏయమ్ రత్నం నిర్మిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేశారు. నేడు పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ #PSPK27 పోస్టర్ రిలీజ్ చేసింది.

ఈ పోస్టర్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ తన కెరీర్లో ఎప్పుడూ చేయనటువంటి కొత్త గెటప్ లో కనిపించబోతున్నాడని అర్థం అవుతోంది. పేస్ ని రివీల్ చేయకుండా ధీరత్వంతో నడుము మీద చేయి వేసుకుని నిలబడినట్లు చూపించారు. ఈ పోస్టర్‌ పవన్‌ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ గారు '#PSPK27 సినిమా 15 రోజుల చిత్రీకరణలో ప్రతిక్షణం టీం అందరికీ గొప్ప జ్ఞాపకంలా కదులుతుంది. చిరస్థాయిగా నిలిచే విజయం కంటికి కనిపిస్తుంది. ఇందుకు కారణం మీరు, మీ ప్రోత్సాహం. మీ సహృదయం. మీరు ఎప్పటికీ ఇలాగే కోట్లాది జనం శుభాకాంక్షలు అందుకుంటుండాలని ఆశిస్తున్నాను అంటూ' ట్విట్టర్‌లో దర్శకుడు క్రిష్‌ పోస్టు చేశారు.Next Story