నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన 'పీఎస్ఎల్వీ-సీ48'

By సుభాష్  Published on  11 Dec 2019 10:27 AM GMT
నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ-సీ48

పీఎస్‌ఎల్‌వీ-సీ48 నిప్పులు చిమ్ముతూ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌లోని మొదట ప్రయోగ వేదిక నుంచి శాస్త్రవేత్తలు ఈ రాకెట్‌ను ప్రయోగించారు. రీశాట్‌-2 బీఆర్‌1తో పాటు మరో తొమ్మిది విదేశీ శాటిలైట్లను అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. రీశాట్‌-2,బీఆర్‌1 శాటిలైట్‌ దేశ సరిహద్దులో నిఘాను పెంచనుంది. కాగా పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌కు ఇది 50వ ప్రయోగం కావడం విశేషం. ఇప్పటి వరకూ ఇస్రో చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ద్వారా చేపట్టిన ప్రయోగాల్లో రెండు మాత్రమే విఫలం అయ్యాయి. శ్రీహరికోట నుంచి ఇప్పటి వరకు ఇస్రో శాస్త్రవేత్తలు 75 ప్రయోగాలు చేపట్టారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్త్రో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు.

ఇస్రో ప్రయోగాల్లో పీఎస్‌ఎల్వీ రాకెట్‌కు ప్రత్యేక స్థానముంది. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన రాకెట్లలో ఒకటిగా దీనికి పేరుంది. 49 ప్రయోగాల్లో కేవలం రెండు మాత్రమే విఫలమయ్యాయి. మూడో తరం లాంచ్‌ వెహికల్‌ అయిన పీఎస్‌ఎల్వీ.. చంద్రయాన్‌-1, మంగళ్‌యాన్‌ మిషన్లను విజయవంతం చేసింది. ఇప్పటి వరకు ఇస్రో 310 విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి చేర్చగా తాజా ప్రయోగం విజయవంతమైతే ఆ సంఖ్య 319కి చేరుతుంది.

Next Story