వైద్య సిబ్బందికి సరైన సదుపాయాలు అందించాలి - ప్రియాంక గాంధీ

By Newsmeter.Network  Published on  5 April 2020 10:42 AM GMT
వైద్య సిబ్బందికి సరైన సదుపాయాలు అందించాలి - ప్రియాంక గాంధీ

భారత్‌లో కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతుంది. మహమ్మారి వైరస్‌ భారినపడి ఇప్పటికే 3,588 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, 99 మంది కరోనా వైరస్‌ సోకి మృతి చెందారు. వేగంగా వ్యాప్తి చెందుతున్న కోరనాను కట్టడి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఈనెల 8న అఖిలపక్ష పార్టీల నాయకులతోనూ మాట్లాడనున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కేంద్రానికి కీలక సూచనలు చేశారు. కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతుందని, లాక్‌డౌన్‌ సత్ఫలితాలివ్వాలంటే వైద్య పరీక్షల సంఖ్యను పెంచాలని ఆమె అన్నారు.

Also Read :కళ్ల కలకుంటే.. కరోనా ప్రమాదం పొంచిఉన్నట్లే…

పరీక్షల సంఖ్య పెంచితేనే వైరస్‌ తీవ్రత ఎలా ఉందో.. ఎక్కడ కేంద్రీకృతమైందో తెలుస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇదిలాఉంటే వేల మంది ప్రాణాల్ని కాపాడేందుకు పోరాడుతున్న వైద్యుల్ని సైనికులుగా ఆమె అభివర్ణించారు. కానీ కోవిడ్‌ -19 వ్యాధిగ్రస్తులకు చికిత్స అందిస్తున్న క్రమంలో వైద్యులు, ఇతర సిబ్బందికి సరైన రక్షణ సదుపాయాలు అదండం లేదని పేర్కొన్న ఆమె, వారికి అన్ని సదుపాయాలు అందించాలని, అది బాధ్యతగా భావించాలని కేంద్రానికి సూచించారు. యూపీలోని బందాలో వైద్య సిబ్బందికి తగిన రక్షణ సదుపాయాలు కల్పించకపోవటం, వేతనాల్లో కోత విధించడం అన్యాయమని ప్రియాంక పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కరోనా వ్యాప్తి నివారణలో ప్రజలంతా భాగస్వాములు కావాలని, స్వీయ నిర్బంధం విధించుకోవాలని ప్రియాంక సూచించారు.

Also Read :లాక్‌డౌన్‌ పొడిగింపు ఖాయమా.. కారణం అదేనా?

Next Story