హైదరాబాద్ : ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, ప్రొఫెసర్‌ కె. నాగేశ్వర్‌ మరోమారు ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలవనున్నారు. 2021 ఫిబ్రవరి- మార్చిలో మహబూబ్‌నగర్‌ - రంగారెడ్డి - హైదరాబాద్‌ పట్టభద్రుల నియోజకవర్గానికి జరగనున్న ఎన్నికల్లో మరోసారి పోటీ చేయనున్నట్టు ఆయన ప్రకటించారు.

2007, 2009ల‌లో కూడా ఆయన ఇదే నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. 2014వరకు మండలికి ప్రాతినిధ్యం వహించారు. గత కొన్ని రోజులుగా మీడియా లో ఎన్నికల్లో పోటీ అంశంపై పోటీ అంశంపై తన పేరును ప్రస్తావిస్తూ వార్తలొస్తున్నాయని.. వాటికి ఫుల్‌స్టాప్‌ పెట్టే ఉద్దేశంతోనే ఈరోజు అధికారికంగా ప్రకటిస్తున్నట్టు తెలిపారు. ఇక‌ ఇప్పటికే అనేక సంఘాలు త‌న‌కు మద్దతు ప్రకటించాయని నాగేశ్వర్ అన్నారు.

ఇదిలావుంటే.. మహబూబ్‌నగర్‌ - రంగారెడ్డి - హైదరాబాద్‌ గ్రాడ్యుయేట్స్‌ ఓటరు నమోదుకు దరఖాస్తుల స్వీకరణ తేదీలను అధికారులు ప్రకటించారు. అక్టోబర్‌ 1 నుంచి నవంబర్‌ 6వరకు ఓటరు నమోదుకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. www.ceotelangana.nic.inలో నమోదు చేసుకోవచ్చని ఎలక్ట్రోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులు వెల్లడించారు.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story