అరె.. బండ్ల గ‌ణేష్ కి మళ్లీ ఆశ పుట్టింది..!

By అంజి  Published on  7 Dec 2019 9:32 AM GMT
అరె..  బండ్ల గ‌ణేష్ కి మళ్లీ ఆశ పుట్టింది..!

ప‌వ‌న్ కళ్యాణ్‌కి అభిమానుల రూపంలో చాలామంది భక్తులు ఉన్నా.. అందరికంటే కూడా పవర్ స్టార్ కి తానే పవర్ ఫుల్ భక్తుడిని అని అవసరం లేకపోయినా కల్పించుకొని మరి బలంగా చెప్పుకుంటుంటాడు బండ్ల గ‌ణేష్. రీసెంట్ గా ఈ భక్తుడు అనేక కేసులతో కొన్ని రోజులు హాట్ టాపిక్ మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా బండ్ల పెద్ద ప్లాన్ వేశాడు. బండ్ల పవన్ కళ్యాణ్‌తో ఎలాగైనా మళ్లీ ఓ ఫిల్మ్ చేయాలకుంటున్నాడు. దాని కోసం ఇప్పటికే సైలెంట్ గా గత కొన్ని రోజులుగా ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాగూ పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలు చేయబోతున్నారు అని వార్తలు రావడం, పవన్ కూడా సినిమా చేస్తే తప్పేంటి అని మళ్ళీ మాట మార్చి ప్రకటించడంతో బండ్లలో ఆశ పుట్టిన్నట్లు ఉంది. కానీ బండ్లకు పవన్ కళ్యాణ్ డేట్లు ఇస్తాడా అనేది డౌటే.

అయితే పవన్ ను ఒప్పించాలని బండ్ల మాత్రం కిందా మీద పడుతున్నాడు. ఆ క్రమంలోనే త్రివిక్రమ్ తో అలాగే డైరెక్టర్ డాలీతో కూడా ఇప్పటికే మాట్లాడాడట. ఎలాగూ స్టార్ కాంబినేషన్ లను కలిపేసి సినిమాలు నిర్మించడంలో బండ్లకు షాట్ తో పెట్టిన విద్య. ఆ విద్యనే వాడి పవన్ కళ్యాణ్ ను కాక పడుతూ ముందుకుపోతున్నాడట. ఇప్పట్లో కాకపోయినా వచ్చే రెండుమూడు ఏళ్లల్లోనైనా పవన్ కళ్యాణ్ హీరోగా సినిమా చేయడానికి అంగీకరిస్తే పవన్ కి 40 కోట్ల రెమ్యునేష‌న్ ఇచ్చుకుంటానని కూడా ఆఫర్ చేశాడట. ఇలా రెమ్యున‌రేష‌న్ ల పరంగా రూ.80 కోట్లు గుమ్మరించేసి.. మరో రూ.70 కోట్ల‌లో సినిమా ఫస్ట్ కాపీని పూర్తి చేసేసి.. ఓవరాల్ గా సినిమాను 200 కోట్లకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకోవాలని కమర్షియల్ ప్రొడ్యూసర్ గా బండ్ల భారీ కమర్షియల్ ప్లాన్. మరి మన బండ్ల గణేష్ ప్లాన్, ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి.

Next Story
Share it