కామ్రేడ్‌ భారతక్కగా ప్రియమణి.. ఫస్ట్‌ లుక్‌ వైరల్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Jun 2020 12:03 PM IST
కామ్రేడ్‌ భారతక్కగా ప్రియమణి.. ఫస్ట్‌ లుక్‌ వైరల్

రానా హీరోగా నటిస్తున్న చిత్రం విరాట పర్వం. సాయి పల్లవి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రియమణి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈరోజు ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఆమె ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో ఆమె పోషిస్తున్న పాత్ర పేరు కామ్రేడ్‌ భారతక్క. ఈ పాత్ర సినిమాకు ఎంతో కీలకమని అంటున్నారు రానా.

మహాసంక్షోభం కూడా ఒక గొప్ప శాంతికి దారి తీస్తుందని ఆమె నమ్మింది. ఫ్రెంచి విప్లవంలో విద్యార్థుల పాత్ర ఎంత కీలకమో విరాటపర్వంలో కామ్రేడ్‌ భారతక్క కూడా అంతే కీలకం అని రానా పేర్కొన్నాడు. ఈ పోస్టర్ లో ప్రియమణి చిరునవ్వులు చిందిస్తూ ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తోంది. బ్లాక్ డ్రెస్ తో పాటుగా భారీ ఆయుధాల్ని మోస్తూ కనిపించింది.

1984 జూన్‌ 4న బెంగళూరులో ప్రియమణి జన్మించారు. ఆమె అసలు పేరు ప్రియా వాసుదేవ్‌ మణి అయ్యర్‌. 2003లో ఎవరే అతగాడు చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. పెళ్లైన కొత్తలో సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. యమదొంగ వంటి చిత్రాల్లో నటించింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళీ చిత్రాల్లోనూ నటించారు. తమిళ సినిమా పరుత్తివీరన్‌ సినిమాకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం అందుకుంది.



Next Story