మళ్లీ సినిమాల్లోకి రోజా..?

By సుభాష్  Published on  3 Jun 2020 9:47 AM GMT
మళ్లీ సినిమాల్లోకి రోజా..?

సినీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సినీ నటి, నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా మళ్లీ సినిమాలవైపు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. రోజా ప్రస్తుతం పాలిటిక్స్‌ తో పాటు జబర్దస్త్‌ వంటి రియాలిటీ షోలకు జడ్జీగా న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక తెలుగులో శంభో శివ శంభో, గోలీమార్‌ వంటి సినిమాల తర్వాత సినిమా రంగంపై పెద్దగా దృష్టి సారించలేరు. సినీ వర్గాల సమాచారం ప్రకారం.. రోజా మళ్లీ సినిమాలో నటించేందుకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.

తాజాగా రోజాకు అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'పప్పు' మూవీలో విలన్‌ పాత్ర కోసం రోజాను సంప్రదించినట్లు తెలుస్తోంది. కాగా, ఈ సినిమా స్టోరీ మొత్తం నల్లమల, శేషాచలం ఫారెస్టు అడవుల్లో చిత్రీకరించనున్నారు. అలాగే ఈ సినిమాలో విలన్‌ పాత్రగా రోజా సరైన న్యాయం చేస్తారని దర్శకుడు సుకుమార్‌ భావించినట్లు తెలుస్తోంది. అంతేకాదు సినిమాల్లో నటించేందుకు సుకుమార్‌ రోజాను కూడా కలిసి ఆమె పాత్రకు సంబంధించిన వివరాలు తెలిలుపగా, అందుకు రోజా కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. అంతేకాదు రోజా రాజకీయాల పరంగా, అలాగే రియాలిటీ షోలు చేస్తుండటంతో బిజీబిజీగా ఉండటంతో ఈ సినిమా కోసం కేవలం పదిహేను రోజులు మాత్రమే సమయం కేటాయిస్తానని, ఆలోపే తన పాత్రకు సంబంధించిన షూట్స్‌ తీసుకొని కంప్లీట్‌ చేయాలని రోజా డైరెక్టర్‌కు కండీషన్‌ కూడా పెట్టినట్లు తెలుస్తోంది.

కాగా, రోజా కండీషన్లు పెట్టడంతో 15 రోజుల్లో రోజాకు సంబంధించిన పాత్ర షూట్స్‌ ను ఎలా పూర్తి చేయాలో తెలియక అయోమయంలో పడ్డట్లు తెలుస్తోంది. అయితే డైరెక్టర్‌ సుకుమార్‌ కూడా రోజా చెప్పినట్లుగానే సాధ్యమైనంత వరకూ తక్కువ సమయంలోనే చిత్రీకరణ చేసేలా ప్లాన్‌ చేస్తున్నాడట. కాగా, ప్రస్తుతం రోజాకు ఏపీలో సినిమా షూటింగ్‌ కు సంబంధించిన ఓ కమిటీ చైర్మన్‌గా సీఎం జగన్‌ నియమించబోతున్నట్లు వినికిడి. ఏది ఏమైనా రోజా సినిమాలో మళ్లీ ఎంట్రీ ఇవ్వబోతున్నారా..? లేదా..? అనేది తెలియాలంటే చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించే వరకూ వేచి చూడాల్సిందే.

Next Story