నా భర్తే నా మేనేజర్..!
By మధుసూదనరావు రామదుర్గం
జాతీయ అవార్డు విన్నర్, గ్లామరస్ హీరోయిన్ ప్రియమణి టాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో తెగ బిజీగా ఉంటోంది. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విరాటపర్వంలో ప్రధాన పాత్ర పోషించింది. అలాగే విక్టరీ వెంకటేష్ నటిస్తున్న నారప్ప సినిమా లోనూ తనతో జట్టు కట్టింది. అలాగే బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ నటిస్తున్న స్పోర్ట్స్ సినిమా మెయిడెన్‌లో అతని భార్యగా నటిస్తోంది. వీటితోపాటు విడుదలకు రెడీగా ఉన్న హాట్‌స్టార్ సీరీస్ ఫ్యామిలీమేన్‌లో నటించింది. ఇలా అందిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటోంది ప్రియమణి.
తను ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భర్త ముస్తాఫా రాజ్ తన మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారని చెప్పుకొచ్చింది. ఇకపై రానున్న బాలీవుడ్ ప్రాజెక్టులకు సంబంధించి కాల్‌షీట్ వ్యవహారాలన్నీ తనే చూసుకుంటారని వివరించింది. ప్రియమణి ముస్తాఫా రాజ్‌ల వివాహం 2017 ఆగస్టులో జరిగింది. అప్పట్లో ముస్తాఫా ఈవెంట్ మేనేజర్‌గా ఉండేవారు. ఈ సందర్భంగా ప్రియమణి మాట్లాడుతూ.. అత్యంత అవగాహనతో మెలగుతూ, తనను తన కెరీర్‌ను అర్థం చేసుకున్న భర్త దొరకడం నిజంగా తన అదృష్టమని పేర్కొంది.