నెట్టింట్లో హీరోయిన్ ప్రేమలేఖ.. నెటిజన్లు ఏమంటున్నారంటే..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 28 Jan 2020 4:45 PM ISTప్రియా భవానీశంకర్.. కమలహాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇండియన్-2 చిత్ర కథానాయిక. ఈ అమ్మడు ఇటీవల తరచూ వార్తల్లో ఉంటుంది. దీనికి కారణం నటుడు, దర్శకుడు ఎస్‌జే సూర్య. బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చిన ప్రియా భవానీ.. ఎస్‌జే సూర్యతో కలిసి మాన్‌స్టర్ చిత్రంలో నటించింది. తాజాగా వీరిద్దరి కలయికలో 'బొమ్మై' అనే మరో సినిమా కూడా తెరకెక్కుతుంది. దీంతో వీరిద్దరి ప్రేమాయణం నడుస్తున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయ్. వీటిపై స్పందించిన సూర్య.. ఆమె నాకు మంచి స్నేహితురాలని తెలిపాడు. అయినా వీరి మధ్య ఏదో నడుస్తుందని సోషల్ మీడియాలో వదంతులు వస్తూనే ఉన్నాయ్.
ఈ నేఫథ్యంలో ప్రియా భవానీ ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్న తన ప్రియుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ... ప్రేమలేఖ తరహాలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసింది. దీంతో ఆ ప్రేమలేఖ చదివిన నెటిజన్లు అవాక్కయ్యారు. లేఖలో.. ‘పదేళ్ల క్రితం కాలేజీలో ఓ మాదిరి అందంగా ఉన్న నన్ను నీవు ప్రేమించినప్పుడు ఆశ్యర్యపోలేదు. ఇప్పటికీ నీవు నాతోనే ఉండాలని కోరుకోవడమే ఆశ్చర్యంగా ఉంది. మనిద్దరం మరిచిపోయిన మంచి సంగీతం లాంటి వాళ్లం. నాకు ఒక పాప పుడితే తన జీవితంలో నీలాంటి అతను ఒకరు ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటాను. నక్షత్రాలు నిండిన నా జీవితంలో నువ్వే సూర్యుడివి.. పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ.. తన ప్రియుడితో సన్నిహితంగా ఉన్న ఫొటోను జతచేసి ఇన్‌స్టాగ్రామ్‌లో శుభాకాంక్షలు తెలిపింది. ఈ ప్రేమలేఖ ఇప్పు డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోస్టు చేసిన కొద్దిగంటల్లోనే రెండు లక్షలకుపైగా లైక్స్ రావడం విశేషం.