పబ్ ప్రిజం క్లబ్ & కిచెన్ గ్రాండ్ కు జరిమానా !!!

By సత్య ప్రియ  Published on  26 Oct 2019 10:56 AM GMT
పబ్ ప్రిజం క్లబ్ & కిచెన్ గ్రాండ్ కు జరిమానా !!!

తెలంగాణ లీగల్ మెట్రాలజీ శాఖ వారు హైదరాబాద్ లోని ప్రముఖ పబ్ ప్రిజం క్లబ్ & కిచెన్ గ్రాండ్ కి జరిమానా విధించారు. వారి తనిఖీలలో పబ్బులో పెగ్గుల కొలతలను ఉల్లంఘిస్తున్నట్టు తెలుస్తోంది. పబ్ సిబ్బంది నియమిత కొలత కంటే తక్కువ పరిమాణంలో పెగ్గును పోస్తున్నట్టు తేలింది. అంతేకాకుండా, తీసుకోవలసినదాని కంటే ఎక్కువ రుసుము తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తోంది.

ఒక వినియోగదారుడి నుంచి ఫిర్యాదు అందిన మేరకు అధికారులు పబ్బులో తనిఖీలు చేపట్టారు. అక్కడ ఉన్న ఎలక్ట్రానిక్ బరువు కొలిచే యంత్రాలను ఇంకా పరీక్షించాల్సి ఉంది.

ఫిర్యాదు చేసిన వినియోగదారుడికి ఒక పెగ్గు సర్వ్ చేసి, రెండు పెగ్గుల రుసుము తీసుకున్నందుకు గాను జరిమానా విధించారు. పబ్బు యాజమాన్యం 8/25 &30, 24/33 సెక్షన్లను ఉల్లంఘించినట్టు తెలుస్తోంది. యాజమాన్యం పై రెండు కేసులు నమోదు అయ్యాయి.

Whatsapp Image 2019 10 25 At 6.32.54 Pm

లీగల్ మెట్రాలజీ సెక్షన్ 30 ప్రకారం పెగ్గు కొలత అందులో తగిన ప్రమాణాల అనుగుణంగా ఉండాలి. కానీ, అక్కడ పరిమాణం కంటే తక్కువ మోతాదులో మద్యం సర్వ్ చేసినందుకు యాజమాన్యం పై కేసు నమోదు అయ్యింది.

నో యువర్ రైట్స్ వ్యవస్థాపకులు, వినియోగదారుల కార్యకర్త శ్రీ శ్రీకండే ఉమేశ్ కుమార్ మాట్లాడుతూ, "పరిమాణం కంటే తక్కువ మద్యం ఇవ్వడం అనేది చాలా బార్లలో ఉన్న రివాజు, బార్ల యాజమాన్యం వినియోగదారులను ఇలా మోసం చేస్తున్నారు. వీటిపై నిఘా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొలతలూ తూకాల శాఖ వారు దీనిపై దృష్టి సారించాలి" అన్నారు

Next Story