బిగ్‌బ్రేకింగ్ : మహరాష్ట్రలో రాష్ట్రపతి పాలన
By Medi Samrat
మహారాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకై ఎన్సీపీకి ఇచ్చిన గడువు ముగియకముందే రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫార్సు చేశారు. కేంద్ర కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. కేంద్ర కేబినెట్ తీర్మానాన్ని రాష్ట్రపతి కూడా ఆమోదించారు. అయితే.. గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ శివసేన... సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఇదిలావుంటే.. మహరాష్ట్ర ఎన్నికలలో ప్రధాన పార్టీలుగా నిలిచిన బీజేపీ, శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ గడువులోగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. పార్టీలు కనీసం సంకీర్ణ కూటమిని కూడా ఏర్పాటు చేయలేకపోయాయి. ఎన్నికలకు ముందు బీజేపీ-శివసేన దోస్తీ కట్టాయి, కానీ ఫలితాల తర్వాత కుస్తీ బాట పట్టాయి. అలాగే.. సీఎం కుర్చీపై కన్నేసిన శివసేన ప్రయత్నాలకు కాంగ్రెస్, ఎన్సీపీ గండికొట్టడంతో.. ఎన్నికల ఫలితాలు వెలువడిన 19 రోజుల తర్వాత రాష్ట్రపతి పాలన విధించారు.