'ప్ర‌తిరోజు పండ‌గే' అప్‌డేట్ ఏంటి..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 Nov 2019 6:42 AM GMT
ప్ర‌తిరోజు పండ‌గే అప్‌డేట్ ఏంటి..?

మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టిస్తున్న తాజా చిత్రం 'ప్ర‌తిరోజు పండ‌గే'. ఈ సినిమాకి యువ ద‌ర్శ‌కుడు మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ మూవీ చిత్రీకరణ పరంగా ఇప్పటికే ముగింపు దశకి చేరుకుంది. సాయిధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న రాశి ఖన్నా న‌టిస్తుంది. ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలను కూడా చకచకా కానిచ్చేస్తున్నారు. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ తన పాత్రకి సంబంధించిన డబ్బింగ్ చెబుతున్నాడు. కుటుంబం అంటే ఒక కప్పు కింద కొంతమంది కలిసి ఉండటం కాదు .. ఒకరి మనసులో ఒకరు ఉండటం.

అనుబంధాల కోవెలే అసలైన కుటుంబం అని చాటిచెప్పే కథ ఇది అని తెలిసింది. ఈ సినిమాలో తేజూకి తాత పాత్రలో సత్యరాజ్ కనిపించనున్నారు. ఈ సినిమాకి ఆయన పాత్ర హైలైట్ అవుతుందని అంటున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమా, తేజూకి హిట్ అందిస్తుంద‌ని గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నారు. డిసెంబ‌ర్ 20న ఈ సినిమాని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. మ‌రి.. తేజుకి 'ప్ర‌తిరోజు పండ‌గే' సినిమా నిజంగా పండ‌గ‌ని తెస్తుందో లేదో చూడాలి.

Next Story
Share it