ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ కీలక సమావేశం

By సుభాష్  Published on  16 Jun 2020 12:08 PM IST
ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ కీలక సమావేశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు, జిల్లా కలెక్టర్లు హాజరయ్యారు. సమావేశంలో ఉపాధి పనుల ద్వారా గ్రామాల్లో కల్లాలు నిర్మాణంపై చర్చ జరుగుతోంది. అలాగే ఉపాధి హామీతో కాల్వలు, డిస్టిబ్యూటర్ల నిర్మాణం, నియంత్రణ సాగుపై కేసీఆర్‌ చర్చిస్తున్నారు. అలాగే జిల్లాలో కరోనా కేసులపై చర్చించే అవకాశం ఉంది.

కాగా, సోమవారం ప్రగతి భవన్‌లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో రాష్ట్రంలో నియంత్రిత పంటల సాగు విధానం అమలు, రైతు బంధు పథకాలపై చర్చించారు. ఇప్పటికే వ్యవసాయ పనులు ప్రారంభం అయ్యాయని, ఏ ఒక్క రైతు కూడా పెట్టుబడి డబ్బుల కోసం ఇబ్బంది కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఒక్క ఎకరం కూడా మిగలకుండా ప్రతి ఒక్కరైతుకు వారం రోజుల్లో రైతు బంధు పథకం డబ్బులు పడేలా చూడాలని కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.

Next Story