ఖైరతాబాద్‌ ఆర్టీఏ ఆఫీసులో ప్రత్యక్షమైన డార్లింగ్.. ఫోటోలు వైరల్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Aug 2020 12:43 PM GMT
ఖైరతాబాద్‌ ఆర్టీఏ ఆఫీసులో ప్రత్యక్షమైన డార్లింగ్.. ఫోటోలు వైరల్‌

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ ఆర్టీఏ ఆఫీసులో సందడి చేశారు. ప్రభాస్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చాడన్న సంగతి తెలిసిన అభిమానులు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ఆర్టీఏ అధికారులతో పాటు పలువురు ఫ్యాన్సు ప్రభాస్‌తో సెల్పీలు, ఫోటోలు దిగారు. కొవిడ్‌ కారణంగా ప్రభాస్‌ ముఖానికి మాస్క్‌ ధరించారు. మాస్క్‌ తీయకుండానే ప్రభాస్‌ ఫోటోలకు ఫోజులిచ్చాడు. అయితే, ఎవరికి వారు భౌతిక దూరాన్ని పాటిస్తూనే డార్లింగ్ తో ఫొటోలు దిగారు. ఈ తతంగమంతా పూర్తవ్వడానికి కాస్త సమయం పట్టినా, ప్రభాస్ ఓపిగ్గా అడిగిన వారందరితో ఫొటోలు దిగాడు. తన కొత్త కారు రిజిస్ట్రేషన్‌ కోసం ప్రభాస్‌ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చినట్లు తెలిసింది.

ప్రభాస్‌తో సెల్పీలు దిగిన కొందరు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్‌గా మారాయి. మార్చిలో విదేశాల్లో షూటింగ్‌ పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన ప్రభాస్‌ హోం క్వారంటైన్‌కు వెళ్లాడు. అప్పటి నుంచి బయట ఎక్కడ కూడా ప్రభాస్‌ కనపడలేదు. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రాధేశ్యామ్'లో ప్రభాస్‌ నటిస్తున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్‌ వాయిదా పడింది.Next Story