ప్రభాస్ 20వ సినిమా.. లాంచింగ్ ఫోటోలు వైరల్
By తోట వంశీ కుమార్ Published on 8 May 2020 8:35 PM ISTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 20వ చిత్రానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ఓ పీరియాడికల్ లవ్ స్టోరీలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్‌కి జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కరోనాకు ముందు ఈ చిత్రానికి సంబంధించిన ఓ షెడ్యూల్ జార్జియాలో పూర్తి చేశారు. కరోనా కారణంగా ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ వాయిదా పడింది.
కాగా.. దర్శకుడు రాధాకృష్ణ ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమ ఫోటోలను శుక్రవారం ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. దర్శకుడు ఇలా పోస్టు చేశాడో లేదో అలా ఫోటోలు వైరల్‌గా మారిపోయాయి. ఈ ఫోటోలలో ప్రభాస్ చాలా అందంగా కనిపిస్తున్నాడు. పూజా కార్యక్రమానికి చిత్రబృందంతో పాటు దర్శకుడు రాజమౌళి, కృష్ణంరాజు, వి.వి వినాయక్ తదితరులు హాజరైయ్యారు. జార్జియా షెడ్యూల్‌లో ప్రభాస్‌తో పాటు పూజాహెగ్డే, ప్రియదర్శిలపై కీలక సన్నివేశాలని తెరకెక్కించారు. పది డిగ్రీల చలి, వర్షం కరోనా భయాల మధ్య సన్నివేశాలను తెరకెక్కించామని, ఇది చిత్ర బృందంలో స్పూర్తి నింపాయని దర్శకుడు ఇటీవల చెప్పిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి రాధేశ్యామ్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఈ చిత్రానికి రాధేశ్యామ్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారంఈ చిత్రం తరువాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించనున్నాడు.