కరోనా బాధితుల వివరాలు షేర్ చేస్తే జైలుకే..
By రాణి Published on 28 March 2020 5:43 PM ISTకరోనా బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో వాట్సాప్ లో ఓ పోస్ట్ షికార్లు కొడుతోంది. అదే పోలీస్ శాఖ జారీ చేసిన విజ్ఞప్తి..విజ్ఞప్తి అనే కన్నా ఒక రకమైన వార్నింగ్ గా చెప్పొచ్చు. అదే..కరోనా బాధితుల గురించిన వివరాలు ఎవరైనా..ఏ రకమైన సోషల్ మీడియాలో గానీ..గ్రూపుల్లో గానీ షేర్ చేస్తే వారికి మూడు నెలల జైలు శిక్ష తప్పదట.
Also Read : ఏడేళ్ల క్రితమే కరోనా..వ్యాక్సిన్ ఎందుకు కనిపెట్టలేదు ?
'' అన్ని గ్రూప్ సభ్యులకు విన్నపం..కరోనా(కోవిడ్ 19) సోకిన వ్యక్తి యొక్క ఫొటో కానీ, పేరు, అడ్రస్ వివరాలు గానీ ఏ గ్రూపుల్లో షేర్ చేసినా షేర్ చేసిన వ్యక్తితో పాటు..సదరు గ్రూపు అడ్మిన్ కి కూడా మూడు నెలలు జైలుశిక్ష..దయచేేసి గ్రూపుల సభ్యులంతా గమనించగలరు. కరోనా బాధితుడి పేరు, వివరాలను ప్రచారం చేయడం చట్టరీత్యా నేరం. దయచేసి గమనించగలరు. పోలీస్ శాఖ.'' ఇలాంటి సారాంశమున్న పోస్ట్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఇది నిజంగా పోలీస్ శాఖ జారీ చేసిందేనా ? కాదా అన్నదానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
సీపీ అంజనీ కుమార్ కరోనాపై అసత్య ప్రచారాలు చేసే వారికి వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో కరోనాపై అసత్య ప్రచారాలు చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
Also Read :కరోనాపై కేంద్ర ఆరోగ్యశాఖ బులెటిన్