ఔను వాళ్లిద్దరూ మళ్లీ ఒక్కటవబోతున్నారట..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 Sep 2020 10:33 AM GMT
ఎప్పుడూ వార్తల్లో ఉండే మోడల్, నటి పూనమ్ పాండే వైవాహిక జీవితంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తన భర్త సామ్ బాంబే వేధిస్తున్నాడంటూ కేసు పెట్టిన ఆమె వారం రోజుల్లోనే మనసు మార్చుకుంది. తన భర్తతో కలిసి వైవాహిక జీవితాన్ని మళ్లీ కొనసాగించాలని భావించాలనుకుంటున్నట్లు శనివారం రాత్రి ఆమె సోషల్‌మీడియా వేదికగా ప్రకటించింది.
కాగా, పూనమ్ పాండే తన ప్రియుడు సామ్ అహ్మద్ బాంబేను ఈ నెల 9వ తేదీన పెళ్లాడింది. వీరిరువురు చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. కొద్ది రోజులకు ఒక్కటయ్యారు. అయితే.. పెళ్లై నెల తిరగకుండానే సామ్ తనను శారీరకంగా హింసిస్తున్నాడంటూ పూనమ్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. ఈ నెల 22వ తేదీన సామ్ బాంబే బెయిల్‌పై రిలీజ్ అయ్యారు.
ఈ విషయమై పూనమ్ మాట్లాడుతూ.. మా మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకున్నాం. మళ్లీ కలిసి జీవించబోతున్నామని.. మేం ఒకరిని ఒకరం చాలా ప్రేమించుకుంటామని.. మేం పిచ్చి ప్రేమలో ఉన్నామని తెలిపింది. అలాగే.. వివాహ బంధం అన్నాక హెచ్చు, తగ్గులుంటాయని.. అవి మమ్మల్ని ఆపలేవని తెలిపారు. ఈ విషయాన్ని సామ్ బాంబే కూడా ధ్రువీకరించారు. తామిద్దరం కలిసి ఉండబోతున్నామని స్పష్టం చేశారు.