పాటను ఫీలవ్వండి.. నా కాళ్లను చూసి కాదు..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 18 Jan 2020 7:45 PM ISTశిల్పాశెట్టి.. గుర్తుంది కదా..! ఒకప్పటి బాలీవుడ్ నటి.. పొడుగు కాళ్ల సుందరి. కొన్నేళ్ల క్రితం తన పొడుగుకాళ్ల అందాలతో దశాబ్దకాలం పాటు కుర్రకారును ఆకర్షించిన బామ. సరిగ్గా, అలాగే ఇప్పుడు ఓ బామ తన పొడుగు కాళ్లతో యువతను ఆకర్షిస్తుంది. ఓ అడుగు ముందుకేసి అవే నాకు అందం అంటూ ప్రచారం కూడా చేసుకుంటుంది.
వివరాళ్లోకెళితే.. పూజా హెగ్డే. తెలుసు కదా.. ఈ మధ్య వరుస హిట్లతో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌గా దూసుకెళ్తుంది. ఈ బామకు సంక్రాంతి కానుకగా రిలీజైన.. అల వైకుంఠపురములో..' సినిమాతో మంచి పాపులారిటీ వచ్చింది. అసలే బోలెడంత క్రేజీ భామ. ఇక ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో, పూజాని కుర్రకారు నెత్తిన పెట్టుకుంటున్నారు.
�
ఇక.. అల వైకుంఠపురములో.. సినిమాలో డైరెక్టర్ త్రివిక్రమ్.. పూజా హెగ్డేను చాలా అందంగా చూపించాడని టాక్ నడుస్తుంది. ముఖ్యంగా సినిమాలోని పాటలు పూజా హెగ్డే చుట్టూ తిరగడం కూడా ఓ అంశం. దీంతో పూజా హెగ్డే పేరు మార్మోగిపోతోంది. ముఖ్యంగా.. సామజవరగమనా.. సాంగ్ పిక్చరైజేషన్. ఈ పాటలోని సాహిత్యానికి.. పూజా అందాల ప్రదర్శన కూడా తోడవ్వడంతో ఈ పాట కుర్రకారును ఊపేస్తుంది.
�
ముఖ్యంగా.. సాంగ్ లిరిక్స్, విజువలైజేషన్ అంతా పూజా హెగ్డే కాళ్ల మీదే తిరుగుతుంది. అయితే.. అన్నీ బాగున్నాయి కానీ, పూజా కాళ్ల స్కిన్ టోన్ అంత బాగా లేదంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పించారు. క్లోజప్‌గా కాళ్లను చూపించినప్పుడు వాటి అందం మత్తెక్కించేలా ఉండాలి కానీ.. ఎబ్బెట్టుగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయినా తగ్గని పూజా సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా ఏ మాత్రం తగ్గకుండా పొట్టి గౌన్లతో పాల్గొంది. అంతేకాకుండా తనపై విమర్శలు చేసిన నెటిజన్లపై.. పాటను ఫీలవ్వండి కానీ, నా కాళ్లను చూసి ఫీలవ్వకండి అంటూ నెటిజన్లపై ఘాటుగా స్పందించింది.
�
గతంలో.. బాలీవుడ్‌లో సూపర్‌హిట్ అయిన హౌస్‌పుల్-4 సినిమా ప్రమోషన్‌కు సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో స్వయంగా తానే పూజా తన పొడుగు కాళ్లను ప్రమోట్ చేసుకుంది. అంతేకాకుండా సోలో ఇంటర్వ్యూస్, టీమ్ ఇంటర్వ్యూస్‌లో కూడా పూజా తన కాళ్లను విచ్చలవిడిగా ఎక్స్‌పోజ్ చేసుకుంటుంది. నా అందం.. నా కాళ్లు, వీటన్నింటి గురించి మీరెవరు ఏమనుకున్నా సరే.. నాలా నీనుంటా అనే ధిక్కార స్వరాన్ని వినిపిస్తూ దూసుకెళ్తుంది.