ఇడుపులపాయ‌లో ష‌ర్మిల ప్రార్థ‌న‌లు.. వైఎస్సార్‌టీపీ ఆవిర్భావం నేడు

YS Sharmila at Idupulapaaya.తెలంగాణ‌లో మ‌రో కొత్త రాజ‌కీయ పార్టీ ఆవిర్భ‌విస్తోంది. మ‌హానేత

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 July 2021 5:48 AM GMT
ఇడుపులపాయ‌లో ష‌ర్మిల ప్రార్థ‌న‌లు.. వైఎస్సార్‌టీపీ ఆవిర్భావం నేడు

తెలంగాణ‌లో మ‌రో కొత్త రాజ‌కీయ పార్టీ ఆవిర్భ‌విస్తోంది. మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి పేరు మీద ఆయ‌న కుమారై ష‌ర్మిల దీనిని నెల‌కొల్పుతున్నారు. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి తెలంగాణ పార్టీ(వైఎస్ఆర్టీపీ) గా నామ‌క‌ర‌ణం చేశారు. నేడు వైఎస్ఆర్ జ‌యంతి సంద‌ర్భంగా సాయంత్రం పార్టీ జెండాను, ఎజెండాను ప్ర‌క‌టించ‌నున్నారు. కాగా.. ష‌ర్మిల ఇప్ప‌టికే క‌డ‌ప జిల్లా ఇడుపులపాయ‌కు చేరుకున్నారు. వైఎస్ఆర్ ఘాటు వ‌ద్ద ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు నిర్వ‌హించారు. భ‌ర్త అనిల్‌కుమార్‌, త‌ల్లి విజ‌య‌మ్మ‌, వైఎస్ వివేకా కుమారై సునీత త‌దిత‌ర కుటుంబ స‌భ్యులు హాజ‌ర‌య్యారు. తండ్రి స‌మాధి వ‌ద్ద పార్టీ జెండాను ఉంచి ప్రార్థ‌న‌లు చేశారు.


క‌డ‌ప నుంచి ప్ర‌త్యేక విమానంలో మ‌ధ్యాహ్నాం బేగంపేట‌కు చేరుకుంటారు. పంజాగుట్టలోని వైఎస్‌ విగ్రహానికి పూలమాల వేసి సాయంత్రానికి రాయదుర్గంలోని జేఆర్సీ కన్వెన్షన్‌ కేంద్రానికి చేరుకోనున్న షర్మిల.. ఐదు గంటలకు వేదికపైన తెలంగాణ అమరవీరుల స్తూపానికి, వైఎస్​ విగ్రహానికి నివాళి అర్పించి పార్టీ జెండాను ఆవిష్కరించనున్నారు. అనంతరం మాట్లాడనున్న షర్మిల పార్టీ స్థాపన లక్ష్యాలు, అజెండాపై వివరించనున్నారు. రాజన్న సంక్షేమ పాలన తీసుకు రావడమే ధ్యేయమంటూ తెలంగాణ రాజకీయాల్లో రంగ ప్రవేశం చేసిన షర్మిల.. ఇప్పటికే జిల్లాల వారీగా తండ్రి అనుచరులతో సమావేశాలు నిర్వహించి మొత్తానికి నేడు రాజకీయ పార్టీ ప్రకటించనున్నారు.

Next Story