ఆ విషయంలో విమర్శలు వస్తున్నాయి.. జగన్ జాగ్రత్తగా ఉండాల్సిందే!!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్క్రిప్ట్ లేకుండా ఏ విషయాన్ని కూడా చెప్పలేడనే విమర్శలు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 July 2024 3:27 PM IST
ycp,  jagan, speech, Andhra Pradesh, politics,

ఆ విషయంలో విమర్శలు వస్తున్నాయి.. జగన్ జాగ్రత్తగా ఉండాల్సిందే!!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్క్రిప్ట్ లేకుండా ఏ విషయాన్ని కూడా చెప్పలేడనే విమర్శలు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. ఒకప్పుడు ఎంతో ఫైర్ తో తన మనసుకు నచ్చినట్లు మాట్లాడే వ్యక్తిగా వైఎస్ జగన్ కు పేరు ఉంది. అప్పట్లో పార్టీలకు అతీతంగా వైఎస్ జగన్ స్పీచ్ వినడానికి ప్రజలు ముందుకు వచ్చేవారు. కానీ అలాంటి సందర్భాలు ఇటీవలి కాలంలో చాలా తక్కువయ్యాయి. సిద్ధం సభల్లోనూ, సీఎంగా ఉన్న సమయాల్లోనూ పేపర్ చూసి వైఎస్ జగన్ మాట్లాడేవారు. ఇక ఎన్నో సమయాల్లో చెప్పిందే చెబుతూ వచ్చారు. దీంతో టీడీపీ నేతలు కూడా స్క్రిప్ట్ లేకుండా ఏదీ మాట్లాడలేని స్థితికి వైఎస్ జగన్ వచ్చేశారంటూ విమర్శల వర్షం కురిపించారు. మరీ ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టకుండా వైఎస్ జగన్ దాక్కుంది కూడా అవుట్ ఆఫ్ స్క్రిప్ట్ వస్తాయనే భయంతోనే అంటూ కూడా కౌంటర్లు వేసింది అప్పటి ప్రతిపక్షం. ఒక్కటంటే ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టకపోవడానికి ఇదే కారణం అంటూ జనంలోకి ఆ విషయాన్ని తీసుకుని వెళ్ళింది.

ఇక కేవలం ఎమ్మెల్యేగా ఉన్న వైఎస్ జగన్ రెండు సార్లు మీడియా ముందుకు వచ్చారు. ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్టై నెల్లూరు జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి రాగా.. వినుకొండలో హత్యకు గురైన జిలానీ కుటుంబాన్ని పరామర్శించడానికి ఇటీవల బయటకు వచ్చారు. నెల్లూరు జైలు వద్ద వైఎస్ జగన్ చెప్పాల్సింది చెప్పేసి విలేకరుల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. ఇక వినుకొండలో మాత్రం మీడియా ప్రతినిథి ప్రశ్నకు మాట్లాడుతున్నాను కదా ఎందుకు మధ్యలో ప్రశ్నిస్తున్నారంటూ మాట్లాడారు. అక్కడితో ఆగిపోయిన ఆయన ప్రశ్నలు వేస్తే తన ప్రసంగం ఫ్లో దెబ్బతింటుందని అన్నారు. ఆయన ప్రసంగిస్తున్న విషయమేంటో కూడా మర్చిపోయారు. చదువుతున్న స్క్రిప్ట్ లో ఎక్కడ ఆపారో గుర్తుకురాక పక్కన ఉన్న నాయకులు చెబితే ప్రసంగాన్ని పున: ప్రారంభించారు. ఈ రెండు సందర్భాల్లో కూడా జగన్ మాట్లాడిన విషయాన్ని కొందరు పట్టించుకుపోగా.. కనీసం మీడియాతో మాట్లాడడానికి వైఎస్ జగన్ ముందుకు రావడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇకపై అయినా వైఎస్ జగన్ జాగ్రత్తగా ఉంటారో లేదో.. ఈ తడబడడం ఎప్పుడు ఆగుతుందో.. మునుపటి ఫైర్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

Next Story