యూపీలో ప్రారంభమైన 3వ విడత పోలింగ్
Uttar Pradesh elections 3rd phase polling start.ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. రాష్ట్రంలో
By తోట వంశీ కుమార్ Published on 20 Feb 2022 4:37 AM GMTఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. రాష్ట్రంలో మూడో విడుదల పోలింగ్ ప్రారంభమైంది. 16 జిల్లాల్లోని 59 నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. 59 అసెంబ్లీ స్థానాలకు గానూ 627 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మూడో విడత ఎన్నికల్లో 2.15 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. హత్రాస్, ఫిరోజాబాద్, ఎటాహ్, కస్గంజ్, మైన్‌పురి, ఫరూఖాబాద్, కన్నౌజ్, ఇటావా, ఔరైయా, కాన్పూర్ దేహత్, కాన్పూర్ నగర్, జలౌన్, ఝాన్షీ, లలిత్‌పూర్, హమీర్‌పూర్ మరియు మహోబా జిల్లాల్లో పోలింగ్ జరగుతోంది.
ఈ రోజు(ఆదివారం) ఉదయం ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. మూడో విడత ఎన్నికల్లో ముఖ్య నేతలు బరిలో ఉన్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోసుకోకుండా ఉండేందుకు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కర్హాల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీలో ఉన్నారు. ఇదే స్థానంలో బీజేపీ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి ఎస్.పి. సింగ్ బఘేల్ పోటీలో ఉన్నారు. దీంతో ఇక్కడ ఎవరు గెలుస్తారో అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఇక కాంగ్రెస్ అధికారంలో ఉన్న పంజాబ్‌లో కూడా నేడు ఒకే దశలో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 117 స్థానాలకు ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఇక పంజాబ్‌లో బహుముఖ పోటి నెలకొంది. సుదీర్ఘకాలం నుంచి మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ, అకాలీదళ్ ఈ సారి ఒంటరిగా పోటీ చేస్తున్నాయి. మరో వైపు కాంగ్రెస్, ఆప్ నువ్వానేనా అన్నట్లుగా ప్రచారాన్ని నిర్వహించాయి.