రాజకీయ సంక్షోభం.. రంగంలోకి దిగిన సీఎం స‌తీమణి

Uddhav's wife Rashmi steps into Maha talks.మ‌హారాష్ట్రలో రాజ‌కీయ సంక్షోభం కొన‌సాగుతోంది. శివసేనలో పుట్టిన ముసలం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Jun 2022 11:17 AM IST
రాజకీయ సంక్షోభం.. రంగంలోకి దిగిన సీఎం స‌తీమణి

మ‌హారాష్ట్రలో రాజ‌కీయ సంక్షోభం కొన‌సాగుతోంది. శివసేనలో పుట్టిన ముసలం కారణంగా అక్కడి రాజకీయాలు ఊహించని మలుపులు తీసుకుంటున్నాయి. ఏక్ నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన రెబెల్స్ ప్ర‌భుత్వంపై తిరుగుబాటు చేశారు. దీంతో ప్ర‌భుత్వం మ‌నుగ‌డ ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. స్వ‌యంగా ఉద్ధవ్‌ థాక్రే.. తాను సీఎం పదవి నుంచి తప్పుకుంటానని ప్రకటించినప్పటికీ అసమ్మతి ఎమ్మెల్యేలు శాంతించడంలేదు.

అస‌మ్మ‌తి ఎమ్మెల్యేల‌ను బుజ్జ‌గించేందుకు సీఎం ఉద్ధవ్‌ సతీమణి రష్మీ థాక్రే రంగంలోకి దిగారు. అస‌మ్మ‌తి స‌భ్యుల భార్య‌ల‌తో ఆమె చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. ఒక్కొక్క‌రి ఇంటికి వెలుతున్న ర‌ష్మీ థాక్రే.. వారి భ‌ర్త‌ల‌ను ఎలాగైనా రాజీ చేయాల‌ని కోరుతున్నారు. మ‌రీ ఈ ప్ర‌య‌త్నం ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తుందో చూడాలి.

ఇదిలా ఉంటే.. గుహ‌వాటిలో ఉన్న రెబెల్ ఎమ్మెల్యేలు మ‌రో రెండు రోజులు అక్క‌డే ఉండాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లుగా స‌మాచారం. ఈ రోజు(ఆదివారం) మ‌ధ్యాహ్నాం 12 గంట‌ల‌కు మ‌రోసారి భేటీ అయి త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ ఏంటో చ‌ర్చించాల‌నుకుంటున్న‌ట్లుగా తెలుస్తోంది. మ‌రోవైపు శివ‌సేన జాతీయ కార్య‌వ‌ర్గం శ‌నివారం స‌మావేశ‌మైంది. ఇందులో రెబల్స్‌పై చర్యలు తీసుకొనేందుకు ఉద్ధవ్‌కు అధికారం అప్పజెప్పుతూ తీర్మాణం చేశారు. అయితే.. వారిపై వెంటనే చర్యలు తీసుకోకూడదని, వేచి చూడాలని నిర్ణయించింది. ఈ క్ర‌మంలో రాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. శివ‌సేన‌తో పోరాడే స‌త్తా గ‌న‌క వారికి ఉంటే మేం పోటీకి సిద్ధం. ఇక ద్రోహుల‌ను గెల‌వనిచ్చే ప్ర‌సక్తే లేదన్నారు.

'ఓట్లు అడిగేవారు మీ తండ్రి పేరిట ఓట్లడగండి కానీ బాల్‌ ఠాక్రే పేరు వాడొద్దు' అని ఉద్ధవ్‌ ఠాక్రే రెబల్స్‌కు స్పష్టం చేసినట్టు పార్టీ సీనియర్‌ నేత సంజయ్‌ రౌత్‌ పేర్కొన్నారు.

Next Story