ట్వీట్ వార్ : మెప్పుకోసం విప్పుకొని తిరుగుతావా రాజా.. ఏ1 చేతిలో త‌న్నులు తిన‌కుండా చూస్కో

Tweets War between Raghu Rama Krishnam Raju and Vijaya Sai Reddy.వైఎస్ఆర్ సీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Jan 2022 2:54 PM IST
ట్వీట్ వార్ : మెప్పుకోసం విప్పుకొని తిరుగుతావా రాజా.. ఏ1 చేతిలో త‌న్నులు తిన‌కుండా చూస్కో

వైఎస్ఆర్ సీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు, మరో ఎంపీ విజయసాయి రెడ్డి మధ్య ట్వీట్ల వార్ నడుస్తోంది. ర‌ఘురామకృష్ణంరాజు మీడియా సమావేశాలు నిర్వహిస్తుండటంపై విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఓ నేత ప్రేమ కోసం ర‌ఘురామ‌కృష్ణంరాజు ప‌డ‌రాని పాట్లు ప‌డుతున్నార‌ని ఎద్దేవా చేశారు.

'ఎవరి మొప్పు కోసమో విప్పుకు తిరిగే స్థాయికి దిగజారావా రఘురామా.. 40 ఏళ్ల అనుభవమే ఈ వయసులో పక్కవాళ్ల‌కు ప్రేమ బాణాలు వేస్తుంటే అతడి ప్రేమకోసం పడరాని పాట్లూ పడుతున్నావా? పనిచేసే వారికే పట్టం కడతారు ప్రజలు. ఢిల్లీలో కూర్చుని కాకమ్మ కబుర్లు చెబితే వాళ్లే రాళ్లతో కొడతారు' అంటూ విజ‌య‌సాయి రెడ్డి విమ‌ర్శులు గుప్పించారు.

దీనిపై ర‌ఘురామ‌కృష్ణ రాజు ధీటుగా కౌంట‌ర్ ఇచ్చారు. 'నువ్వు నీ ప్రేమ బాణాలు విశాఖ నవ యువతుల మీద విసురుతున్నావు అంట కదా! పని చెయ్యకుండా ప్రజలను పీక్కుతింటున్న మిమ్మల్ని త్వరలో ఆ ప్రజలే రాళ్లతో కొడతారు. నువ్వు ఎన్ని ట్వీట్లు పెట్టినా ఏ1 నీకు రాజ్యసభ రెన్యువల్ చెయ్యడు అంట. ముందు నువ్వు ఏ1 చేతిలో తన్నులు తినకుండా ఉండేలా చూసుకో 'అంటూ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు చుర‌క‌లంటించారు.

Next Story