దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి రాజకీయ వారసులు ఎవరు?

Trouble is brewing in Mekapati Family wife or brother who will be the heir apparent of late AP Minister Goutham Reddy

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 April 2022 11:43 AM GMT
దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి రాజకీయ వారసులు ఎవరు?

మేకపాటి గౌతమ్ రెడ్డి మరణాన్ని ప్రజలు, కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు ఆయన రాజకీయ వారసత్వం అందేది ఎవరికా..? అనే ప్రశ్న కూడా వెంటాడుతూ ఉంది. ఒక నెల క్రితం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసిన ఆంధ్రా మాజీ ఐటీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని కోల్పోయిన కుటుంబంలో ఆయన స్థానంలో రాజకీయంగా ఎవరు నిలబడతారా..? అనే ప్రశ్న మొదలైంది.

వారసత్వంగా.. దివంగత గౌతమ్ భార్య కీర్తిరెడ్డి కానీ ఆయన సోదరుడు విక్రమ్కుమార్ రెడ్డిలో ఎవరో ఒకరు ఆయన స్థానంలో నిలబడనున్నారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి తన చిన్న కుమారుడు విక్రమ్ కుమార్ రెడ్డిని పెద్ద కొడుకు స్థానంలో చూసుకోవాలని భావిస్తూ ఉన్నారు. గౌతమ్ భార్య మాత్రం తన భర్త వారసత్వాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు.. ఆమె తన కొడుకు అర్జున్ రెడ్డి ఎదిగే వరకూ రాజకీయాల్లో ఉండాలని, ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటోంది.

మేకపాటి కీర్తి రెడ్డి (46) ఎన్నికల్లో పోటీ చేయడంపై 'సీరియస్‌'గా ఆలోచిస్తూ ఉన్నారని న్యూస్‌మీటర్ కు కొన్ని వర్గాల ద్వారా తెలిసింది. ఆమె అత్తమామలు వారి కోడలికి మద్దతు ఇవ్వడం లేదనే వార్తలు కూడా వస్తున్నాయి. గౌతమ్ రెడ్డి మరణించిన ఒక వారం తర్వాత ఆ కుటుంబంలో సమస్యలు మొదలయ్యాయని.. ఆయన మరణం రాజకీయ శూన్యతను మిగిల్చిందని తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాలు న్యూస్‌మీటర్‌కు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూరు నియోజకవర్గాన్ని దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తన బిడ్డలాగా చూసుకున్నారు. 2014లో టీడీపీ ప్రభుత్వ హయాంలో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2019లో మళ్లీ ఎన్నికై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. మేకపాటి కీర్తిరెడ్డి గౌతమ్ వారసత్వాన్ని కాపాడాలనుకుంటోంది. గౌతమ్‌తో కలిసి పనిచేసిన పలువురు సీనియర్ నేతలు ఆమెను గౌతమ్ వారసురాలిగా కోరుకుంటున్నారు. ఆమె పట్ల చాలా సానుభూతి ఉంది. ఒకవేళ ఆమె పోటీ చేయకపోతే పార్టీకి కూడా గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.

కీర్తిని సంప్రదించకుండానే గౌతం తండ్రి రాజమోహన్ రెడ్డి తన కొడుకు విక్రమ్ కుమార్ రెడ్డిని వారసుడిగా ప్రకటించారు. గౌతమ్‌ మరో సోదరుడు పృథ్వీ కుమార్ రెడ్డి రాజకీయాల్లోకి రావడానికి నిరాకరించి, గౌతమ్‌ స్థానంలో ఎవరైనా పోటీ చేస్తే అది కీర్తికే దక్కుతుందని, మరెవరూ కాదన్న తర్వాత ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

నెల్లూరు నుంచి మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన మేకపాటి రాజమోహన్‌కు మేకపాటి గౌతమ్ రెడ్డి, పృథ్వీ కుమార్ రెడ్డి, విక్రమ్ రెడ్డి ముగ్గురు కుమారులు ఉన్నారు. కొడుకులు పృథ్వీ, విక్రమ్ KMC గ్రూప్ సామ్రాజ్యాన్ని చూసుకుంటూ ఉన్నారు. "గౌతమ్, కీర్తికి పెళ్ళై 2022 సంవత్సరం నాటికి 25 సంవత్సరాలు. గౌతమ్ పుట్టినరోజు సందర్భంగా బంధువులందరూ జైసల్మేర్‌లో సమావేశమయ్యారు. గౌతమ్-కీర్తి 25వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేశారు. కానీ వారి జీవితంలో ఊహించని విషాదం చోటు చేసుకుందని" ఓ సోర్స్ మాకు తెలిపింది.


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్యాబినెట్ 2.0లో కీర్తి రెడ్డిని చేర్చుకుంటారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే అవి రూమర్స్ మాత్రమే అని తేలింది. కీర్తిని మంత్రివర్గంలోకి తీసుకుంటే, ఆమె మరో 6 నెలల్లో ఎన్నికలలో పోటీ చేయాల్సి ఉంటుంది. సిట్టింగ్ శాసనసభ్యుడు మరణిస్తే, ప్రతిపక్షం గౌరవ సూచకంగా పోటీ చేయడం మానేస్తుంది. తరతరాలుగా కొన్ని సందర్భాల్లో మినహా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతోంది ఇదే..!

YSRCP కీలక వ్యక్తులకు ఫోన్ కాల్

కీర్తిరెడ్డి మళ్లీ సాధారణ స్థితికి వస్తున్నారని, పార్టీలో ముఖ్యమైన నేతలు, కీలక వ్యక్తులతో మాట్లాడారని న్యూస్‌మీటర్‌కు తెలిసింది. వారినుండి కీర్తికి సానుకూల స్పందన వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. "YSRCP లోని టాప్ లీడర్లు ఇటీవల కీర్తిని కలిశారు. ఆ సమావేశంలో కుటుంబంతో గంటల తరబడి గడిపారు. కీర్తి ఇటీవల టెలిఫోనిక్ సంభాషణలో పోటీ చేయాలనే కోరికను తెలియజేసింది. వారు ఆమెకు అనుకూలంగా ఉన్నారు" అని సన్నిహిత వర్గాలు తెలిపాయి.

మేకపాటి కీర్తి రెడ్డి ఫైనాన్స్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేట్, సెయింట్ ఫ్రాన్సిస్ నుండి B.Com హానర్స్ చేశారు. కీర్తి.. గౌతమ్ నిర్ణయాల వెనుక ఉన్నారని టాక్ కూడా ఉంది. 2013, 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ.. గౌతమ్ రెడ్డి పాదయాత్రలోనూ ఆమె కీలక పాత్ర పోషించారు. ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు దుబాయ్‌కి వెళ్లిన గౌతమ్ చివరి పర్యటనలో ఆమె కూడా భాగమయ్యారు. కీర్తి రాజకీయాల్లోకి రావాలని ఆమె పిల్లలు కూడా కోరుకుంటూ ఉన్నారు.

"ఎంపీ రాజమోహన్ రెడ్డికి తన ఇంటి మహిళలు ఎన్నికల్లో పోటీ చేయడం ఇష్టం లేదని సన్నిహితుల ద్వారా తెలిసింది. అందుకే విక్రమ్ కి మద్దతు ఇస్తూ ఉన్నారు. అయితే, కీర్తి 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు. ఆమె ఇంటింటికీ వెళ్లి గౌతమ్‌కు ఓట్లు వేయాలని కోరింది. ఆయన భార్య కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొందని గుర్తుంచుకోవాలి" అని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

Next Story