కేటీఆర్ సీఎంగా భావించి పిచ్చి నిర్ణయాలు తీసుకున్నారు: కొండా సురేఖ
తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 3 Oct 2024 11:06 AM GMTతెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. టాలీవుడ్ మొత్తం ఆమె చేసిన వ్యాఖ్యలను ఖండించాయి. అలాగే ఆమె వెంటనే స్పందించి.. తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు కూడా ప్రకటించారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించి మరోసారి స్పందించారు. ఆసక్తికర కామెంట్స్ చేశారు.
పదవీ కాంక్షతోనే కేసీఆర్‌ను కేటీఆర్ ఏదో చేశారనే ప్రచారం జరుగుతోందని అన్నారు మంత్రి కొండా సురేఖ. బడ్జెట్ రోజు అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ మళ్లీ కనిపించలేదని అన్నారు. ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో ఏం చేస్తున్నారో తెలియడం లేదని అన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో కూడా కేసీఆర్ కనిపించడం లేదని అన్నారు. అందుకే కేసీఆర్ కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామన్నారు మంత్రి కొండా సురేఖ. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆరే సీఎంగా ఫీల్ అయ్యేవారని అన్నారు. అప్పుడు కేటీఆర్ పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకున్నారంటూ ఆరోపణలు చేశారు.
ఇక తనపై కొన్ని సోషల్ మీడియా సంస్థలు పిచ్చి రాతలు రాస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి కూడా కేటీఆరే అంటూ విమర్శలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. కవిత బెయిల్ కోసం ప్రధానితో మాట్లాడి ఒప్పందం చేసుకున్నారని, అందుకే బీఆర్ఎస్ నుంచి బీజేపీకి క్రాస్ ఓటింగ్ జరిగిందని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు.