ప్రజాభిప్రాయాలకు అనుగుణంగానే అభ్యర్థుల రెండో జాబితా: చంద్రబాబు

టీడీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ఇప్పటికే ప్రజల ముందుకు తీసుకొచ్చామని చంద్రబాబు గుర్తు చేశారు.

By Srikanth Gundamalla  Published on  14 March 2024 9:15 AM GMT
tdp, chandrababu, second list,  andhra pradesh,

ప్రజాభిప్రాయాలకు అనుగుణంగానే అభ్యర్థుల రెండో జాబితా: చంద్రబాబు 

ఏపీలో సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకే సారి జరుగుతుండటంతో రాష్ట్ర రాజకీయాల్లో హీట్‌ కనిపిస్తోంది. పార్టీల అధిష్టానాలు ఒకవైపు అభ్యర్థులను ఎంపిక చేయడంతో పాటు.. ప్రచారంలో నిమగ్నం అయ్యారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి బరిలోకి దిగాలని నిర్ణయించాయి. అధికార పార్టీ వైసీపీని ఈసారి ఎలాగైనా ఓడించి తాము అధికారం చేపట్టాలని భావిస్తున్నాయి. రాష్ట్ర భవిష్యత్‌ కోసమే తామీ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నాయి. మరోవైపు వైసీపీ తాము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని దీమాగా ఉంది. వారు కూడా ప్రతిపక్ష నాయకుల విమర్శలకు ధీటుగా సమాధానం చెబుతున్నారు. ఇక తాజాగా టీడీపీ అధిష్టానం మరో 34 మందితో ఎన్నికలకు రెండో జాబితా విడుదల చేసింది. ఈ జాబితా గురించి ఆ పార్టీ అధ్యక్షుడు ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు.

రాబోయే 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ఇప్పటికే ప్రజల ముందుకు తీసుకొచ్చామని చంద్రబాబు గుర్తు చేశారు. తాజాగా మరో 34 మంది అభ్యర్థులతో కూడా రెండో జాబితాను విడుదల చేసినట్లు చెప్పారు. అభ్యర్థుల ఎంపికలో ఎప్పటిలాగే ఈ జాబితాను కూడా ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకునే ప్రకటించినట్లు చెప్పారు. అయితే.. రాబోయే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్తులను ఆశీర్వదించి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్స్‌ వేదికగా కోరారు.


Next Story