ఎన్డీఏకు 400కి పైగా సీట్లు వస్తాయి: చంద్రబాబు
నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాని కావడం ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.
By Srikanth Gundamalla Published on 14 May 2024 1:46 PM ISTఎన్డీఏకు 400కి పైగా సీట్లు వస్తాయి: చంద్రబాబు
నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాని కావడం ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి లోక్‌సభ స్థానం నుంచి నామినేషన్ వేస్తున్న సందర్భంగా.. అక్కడికి వెళ్లారు చంద్రబాబు. నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబుతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ కూటమి ముఖ్యనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు.
ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో నామినేషన్ దాఖలు సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ఇదొక చారిత్రక సందర్భంగా చంద్రబాబు పేర్కొన్నారు. వారణాసి పవిత్రమైన ప్రదేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని చంద్రబాబు చెప్పారు. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని చంద్రబాబు అన్నారు. గత పదేళ్లలో దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నో అద్భుత కార్యక్రమాలను తీసుకొచ్చారని చెప్పారు. దేశానికి ప్రధాని నరేంద్ర మోదీ అవసరం ఎంతో ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా భారత్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చే క్రమంలో ప్రధాని మోదీ పాత్ర ముఖ్యమైనదని చెప్పారు. త్వరలోనే ఇండియా ప్రచంచంలో ముఖ్య పాత్ర పోషించబోతుందని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 400కి పైగా సీట్లు రాబోతున్నాయని చంద్రబాబు జోస్యం చెప్పారు.
ఇక ఆంద్రప్రదేశ్‌లో పోలింగ్ గురించి మాట్లాడిన చంద్రబాబు.. పలు కీలక కామెంట్స్ చేశారు. పోలింగ్ ఏపీలో సోమవారం ముగిసిందని చెప్పారు. ఏపీలో వందశాతం ఎన్డీయూ కూటమి స్వీప్ చేస్తుందని దీమా వ్యక్తం చేశారు. బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ చనిపోవడం బాధాకరమని చంద్రబాబు అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.