పార్టీ నాయ‌కుల అభిప్రాయాన్ని కోరిన కేసీఆర్‌.. జాతీయ రాజ‌కీయాల్లోకి వెళ్లే అంశంపై..!

'Should I or Should I not': Wishy-washy KCR seeks opinion from party leaders about joining national politics.జాతీయ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 Jun 2022 5:11 AM GMT
పార్టీ నాయ‌కుల అభిప్రాయాన్ని కోరిన కేసీఆర్‌.. జాతీయ రాజ‌కీయాల్లోకి వెళ్లే అంశంపై..!

హైదరాబాద్: జాతీయ రాజకీయాల వైపు మొగ్గు చూపాలని, కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలతో కూడిన థర్డ్‌ఫ్రంట్‌ను ప్రారంభించాలని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు భావిస్తున్నారు. ఇప్పుడు ఆయన పార్టీ నాయకుల అభిప్రాయం కోరుతున్నారు. శాసనసభ్యులు, ఇతర ముఖ్య నాయకులతో మాట్లాడి జాతీయ రాజకీయాల వైపు మొగ్గు చూపాలా లేక రాష్ట్రంలోనే కొనసాగాలా అన్నది వారి నుంచి తెలుసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆలోచనతో కేసీఆర్ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ పార్టీల నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. "ముఖ్యమంత్రి గారు కేంద్రానికి వెళ్లాలా.. రాష్ట్రంలో ఉండాలా అని అభిప్రాయం అడుగుతున్నారు.. పార్టీ నేతల్లో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.. ఆయన జాతీయ స్థాయిలో ఉండాలని కొందరు కోరుకుంటున్నారు. ఇంకొందరు ఆయన రాష్ట్ర రాజకీయాల్లో ఉంచడానికి ఇష్టపడుతున్నారు" అని టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఒకరు వెల్లడించారు.

కేసీఆర్ రాష్ట్రం విడిచి వెళ్లిపోవడం పార్టీపైనా, ప్రభుత్వంపైనా ప్రభావం చూపుతుందని చాలా మంది టీఆర్‌ఎస్ నేతలు అంగీకరిస్తున్నారు. కేసీఆర్‌ కేంద్రానికి వెళ్లి ఆయన తనయుడు, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావుకు అధికార పీఠాన్ని అప్పగిస్తారనే చర్చ చాలా కాలంగా సాగుతోంది. ''కేటీఆర్‌ను సీఎం చేయండి'' అంటూ గతంలో కూడా డిమాండ్లు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే గతేడాది సికింద్రాబాద్‌లో కేటీఆర్‌ హాజరైన ఓ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్‌ టి పద్మారావు ఇదే డిమాండ్‌ చేసిన తర్వాత ఒక్కరోజులోనే ముఖ్యమంత్రి పార్టీ నేతలకు చురకలంటించి తాను ఎక్కడికీ వెళ్లడం లేదని, రాష్ట్రంలోనే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని స్పష్టం చేశారు. . దీంతో ఊహాగానాలకు కొంత కాలం తెరపడింది. అయితే ఇటీవల కేసీఆర్ మళ్లీ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని భావిస్తూ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన ఎంపీగా పోటీ చేస్తారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆయన పదవిని ఎవరు తీసుకుంటారో ఇంకా క్లారిటీ అన్నది లేదు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కేసీఆర్ ఇప్పటికే రెండుసార్లు కలిశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ), కేంద్ర మాజీ మంత్రి శరద్‌ పవార్‌, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తదితరులను కలిశారు. "కాంగ్రెస్‌ లేకుండా థర్డ్ ఫ్రంట్‌పై చాలామందికి నమ్మకం లేదు. బీజేపీని వ్యతిరేకించడం ఫర్వాలేదు, కానీ కాంగ్రెస్ లేని థర్డ్ ఫ్రంట్ మంచిది కాదు. కాంగ్రెస్ ఉన్నా.. కేసీఆర్ నాయకత్వం వహించాలనుకుంటున్నారు, జాతీయ రాజకీయాల్లో ప్రధానమంత్రి పాత్ర లేదా మరేదైనా ప్రముఖ పాత్రను సూచిస్తుంది. అందరూ అంగీకరిస్తారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న'' అని టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత ఒకరు వివరించారు.

జాతీయ రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని, కేసీఆర్ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీనియర్ పార్టీ నాయకులను కలవడమే కాకుండా, జాతీయ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలకు భారీ మొత్తంలో ఖర్చు చేశారు. దేశ రాజధానిలోని సీనియర్ జర్నలిస్టులతో సంభాషించడం, పంజాబ్ మరియు హర్యానాలో చనిపోయిన రైతుల బంధువులు, చనిపోయిన సైనికుల బంధువులు డబ్బు పంపిణీ చేశారు. రెండు గుర్రాల మీద సవారీ చేస్తూ ఉండగానే కేసీఆర్ 2024 ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. దూకుడుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య తెలంగాణ రాష్ట్రంలో తన పార్టీ మూడవసారి విజయం సాధించే అవకాశాల కోసం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను కూడా నియమించుకున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై, పార్టీ ఎమ్మెల్యేలపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటున్న కేసీఆర్, సుస్థిర ప్రభుత్వం, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వంపై సానుకూల ఇమేజ్‌ని కలిగి ఉన్న విషయాలను తెలుసుకుంటూ ఉన్నారు. ప్రజలను విస్మరిస్తున్నారని కొందరు పార్టీ ఎమ్మెల్యేలపై 'నెగిటివ్‌' రిపోర్టులు వచ్చినట్లు టీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. కొంతమంది ఎమ్మెల్యేల 'నెగిటివ్' సర్వే రిపోర్టులను ఆయా శాసనసభ్యులతో పంచుకుని దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని కోరారు.

కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీని కలవడానికి కూడా పెద్దగా ఇష్టాన్ని చూపించడం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్ర పర్యటనలకు కేసీఆర్ దూరమయ్యారు. బీజేపీ విభజన, మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా కూడా తన వాయిస్ ను వినిపిస్తూ ఉన్నారు కేసీఆర్. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 5 రాష్ట్రాలకు 4 రాష్ట్రాలలో బీజేపీ విజయం సాధించడం ముఖ్యమంత్రికి షాక్ ఇచ్చినప్పటికీ, 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్‌డిఎను ఓడించేందుకు బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలనే ఆశను కోల్పోలేదు. కేసీఆర్ దేశంలో "ద్వేషపూరిత" రాజకీయాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ కేంద్రం వైపు మొగ్గు చూపుతారా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. అయితే ఆయన ఒక్కసారైనా ప్రయత్నించాలని నిశ్చయించుకున్నట్లు కనిపిస్తున్నారు. చూద్దాం కాలమే ఆయన జర్నీని నిర్ణయిస్తుంది.

Next Story