జగన్‌ను వేధించిన కాంగ్రెస్‌తో షర్మిల పొత్తు.. ఆమె ఇష్టం: సజ్జల
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మద్దతు తెలిపారు. ఇదే అంశంపై సజ్జల స్పందించారు.
By Srikanth Gundamalla Published on 3 Nov 2023 6:02 PM ISTజగన్‌ను వేధించిన కాంగ్రెస్‌తో షర్మిల పొత్తు.. ఆమె ఇష్టం: సజ్జల
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మద్దతు తెలిపారు. తాము ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలిపారు. అయితే..ఇదే అంశంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. షర్మిల ఒక రాజకీయపార్టీని స్థాపించారని.. ఆవిడ నిర్ణయాలు ఆవిడవే అని అన్నారు.
రాజకీయ పెట్టినప్పుడు షర్మిల నిర్ణయం ఆమె ఇష్టమని వ్యాఖ్యానించారు సజ్జల రామకృష్ణారెడ్డి. శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సజ్జల ఈ కామెంట్స్ చేశారు. వైఎస్ జగన్‌ను కాంగ్రెస్ పార్టీ గతంలో వేధింపులకు గురి చేసిందని.. అలా పార్టీతోనే షర్మిల చేతులు కలిపారని అన్నారు. అయితే.. అది ఆమె ఇష్టానికే వదిలేస్తున్నట్లు చెప్పారు. నాడు సోనియా గాంధీని కలిసిన వారిలో షర్మిల కూడా ఉన్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆమె ఒక పార్టీ అధ్యక్షురాలు అని.. ఆమె నిర్ణయాలు ఆవిడ ఇష్టమని చెప్పారు. తమకు ఏపీకి చెందిన విషయాలే ముఖ్యమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ కుటుంబాన్ని వేధించిందనీ.. ఇది అందరికీ తెలిసిన విషయమే అన్నారు. జగన్‌పై కాంగ్రెస్ అక్రమ కేసులు పెట్టి వేధించిందని చెప్పారు. అయినా జగన్ మోహన్ రెడ్డి పక్క రాష్ట్ర విషయాలను పట్టించుకోరన్నారు సజ్జల.
మరోవైపు ఎన్నికల బరి నుంచి తప్పుకొని.. కాంగ్రెస్‌కు వైఎస్ షర్మిల మద్దతు తెలుపడాన్ని స్వాగతిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెప్పారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బిడ్డగా కీలక ఎన్నికల్లో షర్మిల తమతో కలిసి రావడం శుభపరిణామం అని మల్లు భట్టి విక్రమార్క అన్నారు.