కేసీఆర్ అధికారంలో లేకపోవడం దురదృష్టకరం: ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
తెలంగాణలో కేసీఆర్ అధికారంలో లేకపోవడం దురదృష్టకరమని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
By Srikanth Gundamalla Published on 18 March 2024 5:05 PM ISTకేసీఆర్ అధికారంలో లేకపోవడం దురదృష్టకరం: ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్లు చెప్పారు. సోమవారం తెలంగాణ భవన్‌కు వెళ్లారు. అక్కడి నుంచి గజ్వేల్‌కు బయల్దేరారు. కేసీఆర్ సమక్షంలో బీర్ఎస్ పార్టీలో చేరతారు. తెలంగాణ భవన్‌కు వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాగా.. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇటీవల తన పార్టీకి రాజీనామా చేశారు.
తెలంగాణలో కేసీఆర్ అధికారంలో లేకపోవడం దురదృష్టకరమని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. తాను ఏదీ ఆశించి బీఆర్ఎస్‌లో చేరడం లేదని క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర పునర్‌నిర్మాణం కోసమే పార్టీ మారుతున్నట్లు చెప్పారు. తెలంగాణ విశాల ప్రయోజనాల కోసం తాను బీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు చెప్పారు. తాను ఎక్కడ ఉన్నా బహుజనుల ప్రయోజనాల కోసం కృషి చేస్తూనే ఉంటానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి గురించి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రస్తావించారు. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు తాను కూడా పాలమూరు బిడ్డనే అని చెప్పారు. తనకు వార్నింగ్‌లు ఇవ్వడం మానుకోవాలని సూచించారు. రేవంత్‌రెడ్డి బెదిరింపులకు తాను భయపడబోనని అన్నారు. మీరు గేట్లు తెరిస్తే అందులో చేరుతున్న గొర్రెల్లో తాను ఒకడిని కాదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ స్వర్ణయుగంగా మారిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. దాన్ని మరో సారి తీసుకొచ్చేందుకు.. ఇందులో భాగస్వామ్యం అవుతానని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేసే అవకాశం దక్కడం ఆనందంగా భావిస్తున్నానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో బీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.