సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి డెడ్‌లైన్‌

Revanth Reddy deadline to CM KCR over Paddy procurement.వరి ధాన్యం కొనుగోళ్ల విష‌యంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 April 2022 7:14 AM GMT
సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి డెడ్‌లైన్‌

వరి ధాన్యం కొనుగోళ్ల విష‌యంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతూనే ఉంది. ఈ క్ర‌మంలో టీఆర్ఎస్ పార్టీ అధ్య‌క్షుడు, సీఎం కేసీఆర్ వ‌రిధాన్యం కొనుగోళ్ల విష‌యంలో ఢిల్లీ వేదిక‌గా నిర‌స‌న దీక్ష‌ల్లో కేంద్ర ప్ర‌భుత్వానికి 24 గంట‌ల డెడ్‌లైన్‌ను విదించిన విష‌యం తెలిసిందే. ఇచ్చిన స‌మ‌యంలో వ‌రి కోనుగోళ్ల‌పై కేంద్రం ఓ నిర్ణ‌యానికి రాకుంటే తామే ఓ నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు. ఈ నేప‌థ్యంలో మ‌ధ్యాహ్నాం 2 గంట‌ల‌కు కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న కేబినేట్ స‌మావేశం కానుంది. ఈ స‌మావేశంలో వ‌రి కొనుగోళ్ల‌పై ఓ నిర్ణ‌యానికి రానున్న‌ట్లు తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలో సీఎం కేసీఆర్‌కు పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి డెడ్‌లైన్ పెట్టారు. మంత్రి వ‌ర్గ స‌మావేశంలో ధాన్యం కొనుగోళ్ల‌ అంశం పై రాష్ట్ర ప్ర‌భుత్వం ఓ నిర్ణ‌యం తీసుకోవాల‌న్నారు. 24 గంట‌ల్లోగా రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల‌ను ప్రారంభించాల‌ని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం ఓ స్పష్టమైన వైఖరి తీసుకుని రైతుల‌కు భ‌రోసా క‌ల్పించ‌క‌పోతే.. ఎక్కడిక‌క్క‌డ మంత్రులు, ఆ పార్టీ నేత‌ల‌ను అడ్డుకుంటామ‌ని రేవంత్ అన్నారు. మద్దతు ధరలకు ధాన్యం కొనుగోలు చేపట్టాలన్న ఆయన, రైతులకు లాభం జరిగేలా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు.

ధాన్యం కొనుగోలు విషయంలో ఇటు రాష్ట్రంలోని టీఆర్ఎస్‌, అటు కేంద్రంలోని బీజేపీ లు ఆడుతున్న దొంగ‌నాట‌కాల‌ను క‌ట్టిపెట్టాల‌న్నారు. రైతుల నుంచి చివరి వరి గింజ వరకు కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతులకు అన్యాయం జరిగితే కాంగ్రెస్ పార్టీ.. రైతుల పక్షాన పోరాటం చేసి వారికి అండ‌గా ఉంటుంద‌న్నారు.

Next Story