ఎన్నికల్లో పొత్తులపై మనసులో మాట చెప్పిన పవన్‌ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులపై తన మనసులోని మాట మరోసారి బయట పెట్టారు.

By News Meter Telugu
Published on : 18 July 2023 7:45 PM IST

Pawan Kalyan, alliances Politics, Janasena,

ఎన్నికల్లో పొత్తులపై మనసులో మాట చెప్పిన పవన్‌ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులపై తన మనసులోని మాట మరోసారి బయట పెట్టారు. వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేసే అవకాశం ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు అందరూ కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎన్నికల ఫలితాలను బట్టి సీఎం ఎవరనేది నిర్ణయిస్తామన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చేయడమే జనసేన విధానమన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన 2014 ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయని.. కొన్ని కారణాలతో 2019లో విడివిడిగా పోటీ చేసినట్లు తెలిపారు. బీజేపీ, జనసేన కలిసే ఉన్నాయని పవన్ చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో ఎన్నికల పొత్తులపై బీజేపీ అగ్రనేతలతో చర్చించే అవకాశం ఉందని పవన్ అన్నారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి మార్గాలపై ఎన్డీఏ భేటీలో చర్చిస్తామని అన్నారు.

తనకు ముఖ్యమంత్రి పదవి ముఖ్యం కాదని, ఆ పదవి ఎవరికి దక్కాలనేది ఎన్నికల ఫలితాల తర్వాత నిర్ణయిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు తమకు అండగా నిలిచే రాజకీయ పార్టీలను మాత్రమే కోరుకుంటున్నారని అన్నారు. అధికార వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూసుకుంటే తప్ప, వైఎస్సార్‌సీపీని గద్దె దించడం కష్టమని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది.

Next Story