రాక్షసుడితో పోరాడుతున్నాం..కలిసి ఓడిద్దాం: నాగబాబు

మనం ఒక రాక్షసుడితో పోరాటం చేస్తున్నామని.. కాబట్టి అందరం కలిసి ముందుకు అడుగు వేయాలని నాగబాబు కోరారు.

By Srikanth Gundamalla  Published on  4 Aug 2023 11:23 AM GMT
Nagababu,  Janasena, Pawan Kalyan, YCP,

రాక్షసుడితో పోరాడుతున్నాం..కలిసి ఓడిద్దాం: నాగబాబు

ఏపీలో ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉంది. ఇంకా సమయం బాగానే ఉన్నా.. ఎన్నికలకు ఇప్పుడే సిద్ధమవుతున్నారు పార్టీల నాయకులు. జనసేన, టీడీపీ నాయకులు యాత్రలు, ప్రాజెక్టు సందర్శనలు చేస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వంపై ఇరు పార్టీల నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పొత్తుల మాట అలా ఉంచితే.. పవన్ కల్యాణ్, చంద్రబాబుతో పాటు ఇతర నాయకులు వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ శ్రేణులతో సమావేశం అయ్యారు నాగబాబు. ఈ నేపథ్యంలో సీనియర్లు, యువత అందరూ ముందుకు రావాలని కోరారు. సోషల్‌ మీడియా వేదికగా జనసేకు మద్దతుగా ప్రచారం చేయాలని పిలుపు నిచ్చారు. ఏపీలో ఒక రాక్షసుడితో పోరాటం చేస్తున్నామని.. అందరం కలిసి అడుగులు వేస్తే ఓడించడం కష్టం కాదని అన్నారు. ఈ మేరకు అందరూ కలిసి రావాలని.. వైసీపీని గద్దె దించాలని నాగబాబు కోరారు.

పవన్‌ కళ్యాణ్ వంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని పేర్కొన్నారు నాగబాబు. 2014లో జనం కోసం, రాష్ట్రం కోసం పోటీ చేయకుండా నిస్వార్థంగా మద్దతుగా నిలిచారని చెప్పారు. ఏ పార్టీకి లేని యువత బలం జనసేనకు ఉందని నాగబాబు అన్నారు. ఏది సాధించాలన్నా యువతతోనే సాధ్యమని అన్నారు. మనం ఒక రాక్షసుడితో పోరాటం చేస్తున్నామని.. కాబట్టి అందరం కలిసి ముందుకు అడుగు వేయాలని కోరారు. అలా కలిసి వెళ్లడం ద్వారా రాక్షసుడిని ఓడించడం పెద్ద కష్టం కాదని చెప్పారు. గతంలో ఒక వ్యక్తి కోసం ఓటు వేశారు.. ఈసారి తండ్రిని చూసి కొడుక్కి వేశారు.. ఇప్పుడు పిల్లల భవిష్యత్‌ కోసం పవన్‌ కళ్యాణ్‌కు వేయాలని నాగబాబు కోరారు. సినీ రంగంలో చిరంజీవి, రాజకీయ రంగంలో పవన్‌ కళ్యాణ్‌ను కోట్లాది మంది ఆరాధిస్తున్నారని అన్నారు.


Next Story