కేటీఆర్ రేపటి నుంచి చూస్కో.. మైనంపల్లి హన్మంతరావు కామెంట్స్
తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ హీట్ కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 24 Sept 2024 5:57 PM ISTతెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. రేవంత్ రెడ్డి, రాహుల్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు ఇతర నేతలూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా కేటీఆర్ కామెంట్స్‌పై స్పందించిన మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు కీలక కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీ, రేవంత్‌రెడ్డి గురించి కేటీఆర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. ఇక రేపటి నుంచి ఉంటుంది చూస్తో అంటూ మైనంపల్లి హెచ్చరించారు.
బీఆర్ఎస్ నాయకులు ఇంకా చాలా మంది కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని మైనంపల్లి హన్మంతరావు అన్నారు. ఆ పార్టీ లో ఉన్నవారిని ఎవరూ ఏమీ అనొద్దనీ.. వారు కూడా మనవారే అంటూ మైనంపల్లి అన్నారు. ఇక పార్టీలకు అతీతంగా అరికెపూడి గాంధీ అంటే తనకు ఇష్టమని మైనంపల్లి హన్మంతరావు అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రూ.10 కోట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని ఆరోపించారు. కానీ గాంధీ మాత్రం ఒక్క రూపాయి ఆశించకుండా నాడు బీఆర్ఎస్‌లో చేరారని మైనంపల్లి చెప్పారు. ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని.. త్వరలో పార్టీ మారే అవకాశాలూ ఉన్నాయన్నారు మైనంపల్లి హన్మంతరావు. బీఆర్ఎస్ ఇప్పుడు అధికారం కోల్పోగానే తెలంగాణ, ఆంధ్రా అంటూ చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. సచివాలయాన్ని కూల్చి బీఆర్ఎస్ వాళ్లు నిధులు దోచుకున్నారని మైనంపల్లి హన్మంతరావు ఆరోపణలు చేశారు.