బీజేపీ టికెట్ ఇవ్వకుంటే..రాజకీయాల్లో ఉండను: రాజాసింగ్
బీజేపీ బహిష్కృత నేత, ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Srikanth Gundamalla Published on 29 Aug 2023 7:35 AM GMTబీజేపీ టికెట్ ఇవ్వకుంటే..రాజకీయాల్లో ఉండను: రాజాసింగ్
బీజేపీ బహిష్కృత నేత, ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన పార్టీ మారుతారనే వార్తలు కొంతకాలంగా చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ వార్తలపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మార్పుపై వస్తున్న వార్తలను ఖండించారు.
తాను ఏ పార్టీలోనూ చేరడం లేదని క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్యే రాజాసింగ్. బీజేపీ నుంచే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉంటానని చెప్పారు. తన ప్రాణం పోయినా కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో చేరబోనని స్పష్టం చేశారు. తెలంగాణను హిందూ రాష్ట్రం చేయాలనే లక్ష్యంతో ఉన్నానని చెప్పారు. తన లక్ష్యం కోసం మాత్రమే పని చేస్తానని చెప్పారు. అయితే.. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయని.. తనకు మరోసారి బీజేపీ టికెట్ ఇచ్చి పోటీ చేయమంటే సిద్ధంగా ఉన్నానని అన్నారు రాజాసింగ్. ఒక వేళ బీజేపీ అధిష్టానం తనకు టికెట్ కేటాయించకపోతే.. రాజకీయాల్లో ఉండబోనని చెప్పారు. రాజకీయాలను పక్కనబెట్టి హిందూ రాష్ట్రం కోసం పని చేస్తానని రాజాసింగ్ అన్నారు.
బీఆర్ఎస్ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించడంపై విమర్శలు కూడా చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్. గోషామహల్ అసెంబ్లీ స్థానానికి ఎందుకు బీఆర్ఎస్ అభ్యర్థిని ముందుగానే ప్రకటించలేదని ప్రశ్నించాడు. ఎందుకంటే బీఆర్ఎస్ టికెట్ కూడా ఎంఐఎం చేతిలో ఉందని.. అందుకే పెండింగ్‌లో పెట్టారని విమర్శించారు. దారుసలామ్ నుంచి గోషామహల్ బీఆర్ఎస్ అభ్యర్థిని ఎంపిక చేస్తారని రాజాసింగ్ అన్నారు. అయితే.. బీజేపీ టికెట్ ఇవ్వకపోతే రాజకీయాల నుంచి తప్పుకున్నాక.. ఇండిపెండెంట్‌గా కూడా పోటీ చేయను అని స్పష్టం చేశారు. అయితే.. బీజేపీ అధిష్టానం తనపట్ల సానుకూలంగా ఉందని భావిస్తున్నట్లు రాజాసింగ్ చెప్పారు. సరైన సమయం చూసి సస్పెన్షన్ వేటుని ఎత్తివేస్తారని దీమా వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే టికెట్ కూడా కేటాయిస్తారని.. బీజేపీ నుంచే తాను పోటీ చేస్తానని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలుచచ్చినా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో చేరనన్న రాజాసింగ్బీజేపీ టికెట్ ఇవ్వకుంటే రాజకీయాలకు దూరంగా ఉంటానని వ్యాఖ్యత్వరలోనే బీజేపీ తనపై సస్పెన్షన్ను ఎత్తివేస్తుందన్న ఎమ్మెల్యే pic.twitter.com/mai92dbOr9
— Newsmeter Telugu (@NewsmeterTelugu) August 29, 2023