ఆ ఆరోప‌ణ‌ల‌పై ప్ర‌ధాని, అదానీ ఎందుకు స్పందించ‌రు : మంత్రి కేటీఆర్‌

Minister KTR tweet on Prime Minister Modi.ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, పారిశ్రామిక‌వేత్త అదానీ ని సోష‌ల్ మీడియా వేదిక‌గా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Jun 2022 12:12 PM IST
ఆ ఆరోప‌ణ‌ల‌పై ప్ర‌ధాని, అదానీ ఎందుకు స్పందించ‌రు : మంత్రి కేటీఆర్‌

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, పారిశ్రామిక‌వేత్త అదానీ ని సోష‌ల్ మీడియా వేదిక‌గా రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ విమ‌ర్శించారు. ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్‌), సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థ‌ల‌తో దేశ వ్యాప్తంగా ఉన్న ప్ర‌తి ప‌క్ష నాయ‌కుల‌ను కేంద్రం టార్గెట్ చేయ‌డం సాధార‌ణ‌మే. అయితే.. శ్రీలంక ప్ర‌భుత్వ అధికారులు ప‌వ‌న విద్యుత్ కాంట్రాక్టుల్లో భార‌త ప్ర‌ధాని మోదీ జోక్యం ఉంద‌ని ఆరోపిస్తున్నా.. ప్ర‌ధాని, అదానీ ఎందుకు స్పందించ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. ఈ మేర‌కు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఈడీ విచార‌ణ కొన‌సాగుతున్న త‌రుణంలో మంత్రి కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

శ్రీలంకలో నిర్మించ‌నున్న 500 మెగావాట్ల విండ్ ప‌వ‌ర్ ప్లాంట్‌ను భార‌త్‌కు చెందిన అదానీ గ్రూప్ అడ్డ‌దారిలో చేజిక్కించుకుంద‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. మ‌న్నార్ జిల్లాలో నిర్మించ త‌ల‌పెట్టిన ఈ పవ‌ర్ ప్లాంటును ఎలాంటి పోటీ లేకుండా అదానీ గ్రూప్‌కు క‌ట్ట‌బెట్టాల‌ని భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ..లంక అధ్య‌క్షుడు గొట‌బాయ రాజ‌ప‌క్స‌పై ఒత్తిడి తెచ్చార‌ని ఆ దేశ విద్యుత్తు సంస్థ అధ్య‌క్షుడిగా పనిచేసిన ఎంఎంసీ ఫెర్డినాండో వెల్లడించారు. దీంతో అప్ప‌టి నుంచి లంక ప్ర‌జ‌లు అదానీ గ్రూప్‌న‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు తెలుపుతూనే ఉన్నారు.

Next Story