ఇలాంటి ప్ర‌ధానిని మీరేమ‌ని పిలుస్తారు..? : మంత్రి కేటీఆర్ వ్యంగాస్త్రాలు

Minister KTR satirical tweet on PM Narendra Modi.తెలంగాణ రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క‌శాఖ మంత్రి కేటీఆర్ ప్ర‌ధాన మంత్రి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 July 2022 11:51 AM IST
ఇలాంటి ప్ర‌ధానిని మీరేమ‌ని పిలుస్తారు..? : మంత్రి కేటీఆర్ వ్యంగాస్త్రాలు

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క‌శాఖ మంత్రి కేటీఆర్ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీపై మ‌రోసారి విరుచుకుప‌డ్డారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌ధానిపై వ్యంగాస్త్రాలు సంధించారు. దేశంలో ద్ర‌వ్యోల్భ‌ణాన్ని నియంత్రిచ‌లేని ప్ర‌ధానిని మీరేమంటారు..? అని ట్వీట్ చేశారు. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ స‌రిహ‌ద్దుల్లో చైనా రెండో గ్రామాన్ని నిర్మించింద‌ని, శాటిలైట్ ఫోటోల‌తో స‌హా మీడియా ప్ర‌చురించిన క‌థ‌నాల‌ను ట్వీట్‌కు జ‌త చేశారు.

దేశంలో ద్ర‌వ్యోల్బ‌ణాన్ని, చొర‌బాటు దారుల‌ను నియంత్రించ‌లేని ప్ర‌ధానిని మీరేమంటారు? . ఇలాంటి ప్ర‌ధానిని ఏమ‌ని పిలుస్తార‌ని అని నాలుగు ఆప్ష‌న్ల‌ను ఇచ్చారు. (ఎ) 56" (బి) విశ్వ‌గురు (సి) అచ్చేదిన్ వాలే (డి) పైన పేర్కొన్న‌వ‌న్నీ అన్ పార్ల‌మెంట‌రీ ప‌దాలు కాబ‌ట్టి తొల‌గించ‌బ‌డ్డాయి. అని ట్వీట్ చేశారు.

అప్ప‌ట్లో ఓ మీడియా సంస్థ‌.. 2021లో చైనా మ‌రోసారి బ‌రి తెగించింద‌ని, విస్త‌ర‌ణ‌వాదంతో చెల‌రేగుతున్న చైనా దేశం మ‌న భూభాగంలో ఓ గ్రామం నిర్మించిందని క‌థ‌నాన్ని రాసింది. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ వ‌ద్ద స‌రిహ‌ద్దుకు 4.5 కిలోమీట‌ర్ల లోప‌ల భార‌త్ భూబాగంలో ఈ నిర్మాణాలు చేప‌ట్టిన‌ట్లు శాటిలైట్ చిత్రాల ఆధారంగా ఆ క‌థ‌నాన్ని రాసింది. భార‌త భూబాగ‌మైన ఈ ప్రాంతాన్ని చైనా అనేక సార్లు త‌మ‌కు చెందిన‌దిగా ప్ర‌క‌టించింది. గతంలో అక్క‌డ ప‌లు మార్లు హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

Next Story