మ‌రో టూరిస్టు వ‌చ్చారు.. తిన్నారు.. వెళ్లారు : మంత్రి కేటీఆర్‌

Minister KTR makes satirical comments on Amit Shah.కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌పై టీఆర్ఎస్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 May 2022 6:44 AM GMT
మ‌రో టూరిస్టు వ‌చ్చారు.. తిన్నారు.. వెళ్లారు : మంత్రి కేటీఆర్‌

కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌పై టీఆర్ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఘాటైన విమ‌ర్శ‌లు చేశారు. తెలంగాణ‌లో పొలిటిక‌ల్ టూరిజం సీజ‌న్ కొన‌సాగుతోందన్నారు. 'మ‌రో టూరిస్టు వ‌చ్చారు. తిన్నారు. వెళ్లారు. 8 ఏళ్ల‌లో తెలంగాణ‌కు బీజేపీ ప్ర‌భుత్వం ఏమీ ఇవ్వ‌లేదు. ఇప్ప‌టికీ అదే తంతు కొన‌సాగుతోంది. బీజేపీ అంటే బ‌క్వాస్ జుమ్లా పార్టీ' అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ చేప‌ట్టిన ప్ర‌జాసంగ్రామ యాత్ర ముగింపు సంద‌ర్భంగా శ‌నివారం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ‌లో నిర్వ‌హించిన భారీ బ‌హిరంగ‌స‌భ‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శలు చేశారు. రాష్ట్రంలో అవినీతి స‌ర్కార్‌ను గ‌ద్దె దించేందుకు యువ‌త క‌దిలిరావాల‌ని అమిత్ షా పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నిక‌ల్లో బీజేపీ న‌యా నిజాం న‌వాబును గ‌ద్దె దించాల‌ని కోరారు. ప్ర‌జా సంగ్రామ యాత్ర అధికారం కోసం కాద‌ని.. ద‌ళితులు, ఆదివాసీ, యువ‌త, రైతుల సంక్షేమానికి చేస్తున్న యాత్ర అంటూ పేర్కొన్నారు.

Next Story