కిష‌న్ రెడ్డిపై కేటీఆర్ మండిపాటు.. అలా చేస్తున్నారంటూ

Minister KTR fire on Union Minister Kishan Reddy.కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌ను కేటీఆర్ త‌ప్పుబ‌ట్టారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Oct 2022 12:39 PM IST
కిష‌న్ రెడ్డిపై కేటీఆర్ మండిపాటు.. అలా చేస్తున్నారంటూ

తెలంగాణ రాష్ట్రంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ), తెలంగాణ రాష్ట్ర స‌మితి(టీఆర్ఎస్‌) నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతూనే ఉంది. కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్రానికి అన్ని విధాలుగా స‌హాయ‌స‌హ‌కారాలు అందిస్తుంద‌ని బీజేపీ నాయకులు అంటుంటే అవ‌న్నీ ఉత్తి మాట‌లేన‌ని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు చెబుతున్నారు. రాష్ట్రానికి 9 మెడిక‌ల్ కాలేజీలు కేటాయించిన‌ట్లు కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌ను మంత్రి కేటీఆర్ సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌ప్పుబ‌ట్టారు.

ఓ సోద‌రుడిగా కిష‌న్ రెడ్డిని ఎంతో గౌర‌విస్తాన‌ని, అయితే.. అస‌త్యాలు ప్ర‌చారం చేయ‌డం స‌రైన ప‌ద్ద‌తి కాద‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం 9 మెడికల్ కాలేజీలు మంజూరు చేసిందని మీరు ప్రకటించారు. అది అబద్ధం.. అబ‌ద్దాలు మాట్లాడే కిష‌న్‌రెడ్డికి త‌న త‌ప్పును అంగీక‌రించే ధైర్యం కూడా లేదని చెప్పారు.

హైదరాబాదులో గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు మీరు ప్రకటించారు. ఎప్పటిలాగే.. గుజ‌రాత్‌కు త‌ర‌లించారు. ఈ విషయంలో మీరు హైదరాబాద్ ప్రజలను తప్పుదోవ పట్టించారు. ఇంత జరుగుతున్నా మీరు మీ తప్పుడు వాదనలను సరిదిద్దుకోలేదు. తెలంగాణ‌ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను కేంద్ర ప్రభుత్వం ఎందుకు తుంగలో తొక్కుతున్నదో ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల‌కు ఇచ్చిన హామీలు ఏమ‌య్యాయ‌ని ప్ర‌శ్నించారు. గుజ‌రాత్ బాసుల‌ను సంతోష‌పెట్ట‌డానికి అర్ధ స‌త్యాలు, త‌ప్పుడు వార్త‌ల‌ను ప్ర‌చారం చేసే వ్య‌క్తిగా కిష‌న్ రెడ్డి మారార‌ని ధ్వ‌జ‌మెత్తారు.

Next Story