ప్ర‌ధాని వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుబ‌ట్టిన కేటీఆర్

Minister KTR comments on PM Modi.కార్పొరేటర్లు కమ్యూనిటీ సేవ చేయాలన్న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ వ్యాఖ్య‌ల‌ను మంత్రి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Jun 2022 4:47 AM GMT
ప్ర‌ధాని వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుబ‌ట్టిన కేటీఆర్

కార్పొరేటర్లు కమ్యూనిటీ సేవ చేయాలన్న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ వ్యాఖ్య‌ల‌ను మంత్రి కేటీఆర్ త‌ప్పుబ‌ట్టారు. మోదీజీ మీరు ప్ర‌భుత్వాన్ని న‌డుపుతున్నారా..? లేక ఎన్జీవోనా అని ప్ర‌శ్నించారు. మంగ‌ళ‌వారం బీజేపీ జీహెచ్ఎంసీ కార్పొరేట‌ర్లు ప్ర‌ధాని మోదీని ఢిల్లిలోని ఆయ‌న నివాసంలో క‌లిశారు. ఈ భేటిపై మంత్రి కేటీఆర్ ట్విట్ చేశారు.

తెలంగాణ‌కు, హైద‌రాబాద్‌కు ప్ర‌ధాని మోదీ ఇప్ప‌టిదాకా ఏం చేశారంటూ ఆ ట్వీట్‌లో మంత్రి కేటీఆర్ నిల‌దీశారు. హైద‌రాబాద్ వ‌ర‌ద నివార‌ణ నిధుల విష‌యంలో ఏమైనా పురోగ‌తి ఉందా? మూసీ ఆధునీక‌ర‌ణ ప‌నుల‌కు సంబంధించి ఏమైనా నిధులు ఇస్తారా? హైద‌రాబాద్ మెట్రోకు ఏమైనా ఆర్థిక ద‌న్ను ఇస్తున్నారా? ఐటీఐఆర్‌పై ఏమైనా కొత్త మాట చెబుతారా? ఇలా వ‌రుస ప్ర‌శ్న‌ల‌ను సంధించారు. తెలంగాణ‌కు పైసా నిధులివ్వ‌ని ప్ర‌ధాని మోదీ కార్పొరేట‌ర్ల‌తో మాత్రం ఆత్మీయ స‌మ్మేళనం నిర్వ‌హించారంటూ ఎద్దేవా చేశారు. 2018 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్డీఆర్ఎఫ్ నిధులు తెలంగాణ‌కు ఇవ్వ‌లేద‌ని, దానికి సంబంధించిన వివ‌రాల‌ను మంత్రి ట్వీట్ చేశారు. నిధులు మాత్రం గుజ‌రాత్‌కు.. హైద‌రాబాద్‌కు మాట‌లా..? అని మంత్రి కేటీఆర్ మండిప‌డ్డారు.

జీహెచ్ఎంసీ కార్పొరేట‌ర్లు ప్ర‌ధాని మోదీని ఢిల్లీలోని ఆయ‌న నివాసంలో క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధానీ మోదీ వారితో గంట‌న్న‌ర పాటు స‌మావేశ‌మై ప‌లు విష‌యాల‌పై చ‌ర్చించారు. కార్పొరేట‌ర్లు, ఎమ్మెల్యే స్థాయిలో పోరాడాల‌ని దిశానిర్థేశంచేశారు. స‌మాజ సేవ‌లో అట్ట‌డుగు వ‌ర్గాల‌కు ఎలా స‌హాయ‌ స‌హ‌కారాలు అందించాలో దృష్టి సారించాల‌ని సూచించారు. తెలంగాణ‌లో సుప‌రిపాల‌న రావ‌డానికి,కుటుంబ దుష్పరిపాలనకు చరమగీతం పాడేందుకు భాజపా పోరాటం చేస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

Next Story