సీఎంగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం
M K Stalin was sworn in as CM.డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తమిళనాడు 14వ ముఖ్యమంత్రిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం.
By తోట వంశీ కుమార్ Published on 7 May 2021 5:58 AM GMTడీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తమిళనాడు 14వ ముఖ్యమంత్రిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. స్టాలిన్‌తో పాటు పలువురు మంత్రులుగా ప్రమాణం చేశారు. కరోనా మహమ్మారి విజృంభన నేపథ్యంలో స్టాలిన్ ప్రమాణ స్వీకారాన్ని నిరాడంబరంగా నిర్వహించారు. స్టాలిన్ ప్రమాణం అనంరతం 34 మంది మంత్రులు సైతం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మక్కల్ నీథి మయ్యం అధినేత కమల్ హాసన్, డీఎంకేకు చెందిన ఎమ్మెల్యేలు, కొందరు కీలక నాయకులు పాల్గొన్నారు.
స్టాలిన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఆయన కుమారుడు, ఎమ్మెల్యే, సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక కార్యక్రమం ముగిసిన వెంటనే కేబినెట్ సమావేశమై.. కరోనా నివారణ చర్యలపై రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. ఇక స్టాలిన్ క్యాబినెట్‌లో ఇద్దరు మహిళలు, ఇద్దరు మైనారిటీలకు చోటు దక్కగా.. ఆర్థికశాఖను పీడీఆర్ పళనివేల్ త్యాగరాజన్‌కు, ఆరోగ్యశాఖను సైదాపేట ఎమ్మెల్యే సుబ్రమణ్యంలకు అప్పగించారు. హోంశాఖను మాత్రం స్టాలిన్ తన దగ్గరే ఉంచుకొన్నారు. సీనియర్ నేత దురైమురుగన్‌కు జలవనరులు, చిన్న, భారీ తరహా నీటి ప్రాజెక్టులు, అసెంబ్లీ వ్యవహారాలు శాఖను అప్పగించారు.