రెండు తెలుగు రాష్ట్రాల్లో(ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఏపీలో 11, తెలంగాణలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు గానూ ఎన్నికల షెడ్యూల్‌ను మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం 1, కృష్ణా 2, తూర్పుగోదావరి 1, గుంటూరు 2, విజయనగరం 1, విశాఖపట్నం 2, చిత్తూరు 1, ప్రకాశం 1 స్థానాలకు తెలంగాణ నుంచి ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్ , నిజామాబాద్, ఖమ్మం జిల్లాల నుంచి ఒక్కో స్థానం.. అలాగే కరీంనగర్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి నుంచి రెండేసి ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. వీటినన్నంటిని కలిపి ఎన్నికలు నిర్వహించనున్నారు.
నవంబర్ 16న నోటిఫికేషన్ విడుదలకానుండగా.. నవంబర్ 23 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 24న నామినేషన్ల పరిశీలన జరగనుంది. నవంబర్ 26 వరకూ నామినేషనలను ఉపసంహరించుకునే అవకాశం ఉంది. డిసెంబర్ 10న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 14న ఓట్లను లెక్కించనున్నారు. కాగా.. షెడ్యుల్ విడుదలైన దృష్ట్యా ఆయా జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లేనని ఎన్ని సంఘం తెలిపింది.